Railways to videograph train passengers

Railways to videograph train passengers, CCTVs, Suresh Prabhu, union minister for railways, sensitive train routes videographed, videographed at the time of boarding, railways strengthening security measures, Railways to give commando training to RPF, trains passing through Maoist-affected areas, railway minister suresh prabhu,

Railways to videograph train passengers as security measure

రైలు ప్రయాణికులను ఇకపై వీడియో తీస్తారట..

Posted: 02/20/2015 03:03 PM IST
Railways to videograph train passengers

రైలు ప్రయాణికులను ఇకపై వీడియో తీస్తారట. అదేంటి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రైలు ప్రయాణికులకు తీపి కబురు అందిస్తారని అందరూ ఎదురుచూస్తుంటే.. వీడియో వార్తేంటి చెప్మా అనుకుంటున్నారా..? బడ్జెట్ నేపథ్యంలో రైల్వే టిక్కెట్ ధరలను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించడం కుదరదని ఇప్పటికీ రైల్వే శాఖా మంత్రి సురేష్ ప్రభు తెల్చిచెప్పారు. కాగా రైలు ప్రయాణికులకు పటిష్ట బందోబస్తు సేవలను అందించేందుకు తమ మంత్రిత్వశాఖ పలు చర్యలు చేపట్టిందన్నారు.

భారతీయ రైల్వే వ్యవస్థలో భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.. ఇప్పటికే దాదాపు అన్ని రైల్వే స్టేషన్లలోనూ సీసీ టీవీ కెమెరాలు ఏర్పాట్లు చేయగా ఇక వీడియోల ద్వారా ప్రయాణీకులను భద్రతను పర్యవేక్షించనుంది. ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని సున్నిత ప్రాంతాల్లో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలో నక్సల్స్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కోనేంత పటిష్టంగా రైల్వే రక్షణ దళం(ఆర్పీఎఫ్)కు ప్రత్యేక శిక్షణను ఇచ్చేందుకు ఒక కమాండో ట్రెయినింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.    

'సున్నితమైన ప్రాంతాల నుంచి వెళ్లే రైళ్లకు భద్రతను అందించడంపైనే మా దృష్టంతా. ఇప్పటికే కొన్ని రైళ్లలో ప్రయాణించేవారిని వీడియోలు తీయడం ప్రారంభించాం. కమాండో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కోసం మంచి స్థలాన్ని ఎంపిక చేయబోతున్నామన్నారు. సీసీటీవీ బోగీలను కూడా తీసుకురావాలనుకుంటున్నాం. మహిళలకు భద్రత కల్పించే అంశాన్ని ప్రధానంగా తీసుకుంటున్నామని చెప్పారు. ప్రత్యేకంగా మహిళా వాహినిని ప్రారంభించనున్నట్లు చెప్పారు.


జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trains  videograph  passengers  suresh prabhu  

Other Articles