Amarthya sen quit from vc post of nalanda university

Amartya Sen, vice chancellor, nalanda university, president, mikharjee, pm modi, economist, nobel prize

Is the government blocking one of the world's most celebrated economists and thinkers, Nobel Laureate Dr Amartya Sen, from a second term as Chancellor of Nalanda University? That's certainly what Dr Sen himself believes.

నలంద యూనివర్సిటి విసి పదవి నుండి తప్పుకున్న అమర్థ్యసేన్

Posted: 02/20/2015 03:43 PM IST
Amarthya sen quit from vc post of nalanda university


ప్రపంచంలోని అతి కొద్ది మంది అగ్రగామి ఆర్థికవేత్తల్లో అమర్థ్యసేన్ ఒకరు. అమర్థ్యసేన్ గత కొంత కాలంగా కొత్తగా ప్రారంభించిన నలంద యూనివర్సిటికి వైస్ ఛాన్సిలర్ గా పని చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, దేశానికే తలమానికంగా నలందా యూనివర్సిటీని తీర్చిదిద్దాలని, దాన్ని స్థాపించింది. అందుకు గాను యూనివర్సిటి బాధ్యతలను చూసుకోవడానికి అమర్థ్యసేన్ ను వైస్ ఛాన్సిలర్ గా నియమించింది. అయితే అమర్థ్యసేన్ పదవి కాలం ముగియడంతో, తాత్కాలికంగా పదవిలో కొనసాగుతున్నారు. నలంద విశ్వవిద్యాలయానికి అమర్థ్యసేన్ ను మరికొంత కాలం వైస్ ఛాన్సిలర్ గా కొనసాగించాలని యూనివర్సిటి గవర్నింగ్ బోర్డ్ ఏకపక్షంగా నిర్ణయించింది. దానిపై బోర్డు రాష్ట్రపతికి ఓ లేఖ కూడా రాసింది.

అయితే గత నెల 13వ తేది యూనివర్సిటి గవర్నింగ్ బోర్డు రాష్ట్రపతికి లేఖ రాసినా ఇంత వరకు ఎలాంటి స్పందనా రాలేదు. దాంతో కలత చెందిన అమర్థ్యసేన్ తన పదవి నుండి తప్పుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వానికి తనను మరి కొంత కాలం కొనసాగించడం ఇష్టంలేదేమో, అందుకే తానే పదవి నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. అయితే రాష్ట్రపతి కార్యలయం నెలరోజులైనా స్పందించకపోవడంపై మరోలా భావిస్తున్నారు. రాజకీయ కారణాల వల్లే అమర్థ్యసేన్ పదవిని కొనసాగించడానికి ప్రభుత్వం ఇష్టపడటం లేదని అంటున్నారు. అయితే గత లోక్ సభ ఎన్నికల్లో నరేంద్రమోదీ కి వ్యతిరేకంగా అమర్థ్యసేన్ చేసిన వ్యాఖ్యలే కారణం అని అనుకుంటున్నారు. మొత్తానికి అమర్థ్యసేన్ లాంటి మేధావిని విసి పదవి నుండి దూరం చెయ్యడం అంత మంచిది కాదు అంటున్నారు విద్యావేత్తలు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amartya Sen  vice chancellor  nalanda university  president  mikharjee  pm modi  economist  nobel prize  

Other Articles