గతేడాది బీజేపీ-టీడీపీ కూటమికి సపోర్ట్’గా ఎన్నికల ప్రచారంలో మద్దతు పలికిన పవన్ కల్యాణ్.. ఆనాడే ప్రజలకు అన్యాయం జరిగితే తాను ప్రశ్నించడానికి ఎల్లప్పుడూ ముందుంటాను అని స్పష్టం చేసిన విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా అధికారంలో వున్న ఆ రెండు ప్రభుత్వాలను ఉద్దేశిస్తూ తన ప్రశ్నలదాడిని మొదలుపెట్టేశాడు. గతకొన్నాళ్ల నుంచి సైలెంట్ గా వున్న పవన్.. ఇప్పుడు ప్రజలు, రైతుల తరఫున నిలబడి తనదైన రీతిలో ప్రశ్నించాడు.
ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే.. రైతులు తమ భూములు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. తమకు జీవనాధారమైన భూములను ప్రభుత్వానికి అంటగట్టడం ఇష్టంలేదంటూ నిరసనలు చేయడం మొదలుపెట్టారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న బీజేపీ.. అందుకు మొండిచెయ్యి చూపింది. అంతేకాదు.. నిధుల విషయంపై ఏమాత్రం నోరు మెదపడం లేదు. ఈ రెండు విషయాలను ప్రస్తావిస్తూ పవన్ ట్విటర్ లో ప్రశ్నించాడు. బీజేపీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే సమయం ఆసన్నమైందంటూ పేర్కొన్న పవన్.. అలాగే రైతు కన్నీరు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వానిదేనంటూ ఆయన ట్వీట్ల ద్వారా గొంతెత్తాడు.
ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట నిలబెట్టుకుంటుందనే అనుకుంటున్నానని ఆయన అన్నారు. గత ఏడాది పార్లమెంటులో గందరగోళ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ విభజన బిల్లును నెగ్గించుకుందని, దానికి బీజేపీ కూడా మద్దతు తెలిపిందని అన్నారు. విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మాట ఇచ్చిందని అని పేర్కొన్న ఆయన.. ఇపపుడు ఆ మాట నిలబెట్టుకునే సమయం బీజేపీకి వచ్చిందని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అలాగే రాజధాని నిర్మాణం, భూసేకరణ అంశాలను కూడా ప్రస్తావించాడు. రైతులు కన్నీరు పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని, లేదంటే వారి ఆగ్రహానికి గురికావల్సి వస్తుందని అన్నారు. కొత్త రాజధాని నిర్మాణంలో రైతులు, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత జీవనం ధ్వంసం కాకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభత్వంపై ఉందన్నారు. ఎంతో నమ్మకంతో ప్రజలు టీడిపి - బీజేపి కూటమిని గెలిపించారు, వారి చూపించిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు.
ఇటీవలే కొందరు రైతులు పవన్ దగ్గరికి వెళ్లి తమ ఆవేదన వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే! ఆ నేపథ్యంలోనే తాజాగా పవన్ ఇలా వ్యాఖ్యలు చేసి వుంటారని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు.. ఎన్నికల ప్రచారంలో బీజేపీ-టీడీపీ కూటములు ఇచ్చిన హామీలను ఇంతవరకు తీర్చకపోవడంతో పవన్ పై విమర్శలు వచ్చాయి. ప్రభుత్వాలు ప్రజలకు అనుగుణంగా వ్యవహరించకపోతే తాను ప్రశ్నించడానికే వచ్చానని తెలిపిన పవన్.. ఇప్పుడు ఎందుకు ప్రశ్నించడంలేదన్న విమర్శలు వచ్చాయి. అలా రావడంతోనే ఆయన ఇలా ట్వీట్ చేసి వుంటారని అంటున్నారు. ఏదైతేనేం.. ఎట్టకేలకు పవన్ తన ప్రశ్నల దాడి మొదలుపెట్టేశాడు. మరి.. ఈ ప్రశ్నలపై బీజేపీ-టీడీపీ కూటమి ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more