Finance commission has recommends

Finance Commission, pm modi, central tax, states, ap, arun jaitly, babu

Finance Commission has recommended a record increase of 10 per cent in the devolution of the divisible pool of resources to states. This compares with the marginal increases made by previous Finance Commissions

కేంద్రం వాటాలో రాష్ట్రాలకు ప్రాధాన్యం..ఏపి లోటును తీర్చేందుకు 22,113 కోట్లు

Posted: 02/24/2015 04:24 PM IST
Finance commission has recommends

కేంద్ర ప్రభుత్వం ముందు నుండి ప్రకటించినట్లుగా రాష్ట్రాలను మరింత బలోపేతం చెయ్యనున్నాయి. అందులో భాగంగానే ఫైనాన్సిన్ కమీషన్ తన నివేదికలో రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చింది. కమీషన్ రాష్ట్రాలకు ఇస్తున్న పన్నువాటాలో 42 వాటాను రాష్ట్రాలకు కేటాయించాలని ప్రతిపాదించింది. అదేవిధంగా సహకార పద్దతిలో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం మద్దతు ఇవ్వనుంది. ఇలా ఈ సంవత్సరం బడ్జెట్ రాష్ట్రాలకు, మధ్య తరగతి వర్గానికి అనుకూలంగా ఉంటుందని దాదాపు ఖరారైంది. అయితే రెండుగా విడిపోయిన తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారన్నది ప్రస్తుతం ప్రశ్న.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక లోటును భర్తీ చేసుకోడానికి, వచ్చే ఐదేళ్లలో మొత్తం రూ. 22,113 కోట్లను కేటాయించనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మొత్తం 11 రాష్ట్రాలు రెవెన్యూ లోటులో ఉన్నాయని ఆయన చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించామని, దాని నివేదికను పార్లమెంటులోప్రవేశపెట్టామని వివరించారు. రెవెన్యూ లోటు ఉన్న గ్రామాలకు అదనపు నిధులు కేటాయిస్తామని కూడా చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఏప్రిల్ 1 నుంచి అమలవుతాయని వివరించారు. మొత్తం రూ. 1.91 లక్షల కోట్ల రెవెన్యూ లోటు ఉందని అన్నారు. ఇలా కేవలం ఏపికి చాలీచాలని నిధులతో లోటు బడ్జెట్ ను భర్తీ చేసుకోవాల్సిందిగా కేంద్రం నిర్ణయించడంపై కొందరు పెదవి విరుస్తున్నారు. అయితే బడ్జెట్ లో మాత్రం రెండు రాష్ట్రాలకు రాయితీలు, నిధులు ఎక్కువగా కేటాయిస్తారని కొంత మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తేలాలంటే బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ఆగాలి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Finance Commission  pm modi  central tax  states  ap  arun jaitly  babu  

Other Articles