Traffic comes to a halt as it starts raining money in dubai

Hundreds of 500AED notes, raining MONEY in Dubai, Traffic comes to a halt in Dubai, half a million pounds blows in dubai, nobody knows reason behind money rain in dubai, People dashed out of their cars, People dashed out to get money, Thousands of 500 UAE Dirham notes,

Cash worth more than half a million pounds blows through the city and nobody knows where it came from

ITEMVIDEOS: దుబాయ్ లో కాసుల వర్షం

Posted: 02/24/2015 08:26 PM IST
Traffic comes to a halt as it starts raining money in dubai

అది దుబాయ్. పెట్రో ఉత్పత్తులు కలిగిన దేశాల్లో ఇది ఒకటి. అందుకే ఎక్కడెక్కడి నుంచో అక్కడకు వలస వెళ్లి బతుకుతుంటారు పలు దేశాలకు చెందిన ప్రజలు. మన దేశం నుండి కూడా అనేక మంది ముఖ్యంగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లతో పాటు కేరళా, పంజాబ్ నుంచి అనేక మంది అక్కడ స్థిర నివాసాలు కూడా ఏర్పటు చేసుకున్నారు. అలాంటి సంపన్న దేశంలో ఒక విచిత్రం చోటుచేసుకుంది. ఎక్కడి నుంచి కురిసిందో, ఎలా కురిసిందో తెలియదు కానీ కాసుల వర్షం కురిసింది. అంతే అప్పటి వరకు కార్లలో బడాయిలకు వెళ్లిన వాళ్లు కూడా కార్లను ఎక్కబడితే అక్కడ నిలపి కాసుల ఎరుకునే వేటలో నిమగ్నమయ్యారు. ఫలితంగా పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది.

అలా కురిసింది చిల్లర పైసలు కాదు. ఏకంగా 500 దినార్ల విలువైన నోట్లు... సుమారు 88 పాండ్లు...అంటే మన కరెన్సీలో సుమారుగా ఎనమిది వేల రూపాయల నోటు. అలాంటి నోట్లు ఒకటి, రెండు కాదు వేల సంఖ్యలో రోడ్లపై కురిసాయి. అన్ని నోట్లను చూసిన తరువాత ఎవరైనా ఊరుకుంటారా.. ఎరుకునేందుకు పోటీ పడతారు. అయితే ఇలా కురిసిన నోట్ల విలువ సుమారు రూ. 4.81 కోట్లు ఉంటుందని అధికారిక అంచనాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా దుబాయ్‌లోని జుమీరా ప్రాంతంలో ఆ నోట్ల వర్షం కురిసిందని, అప్పుడు గాలి దుమారం, ఈదురు గాలులు బలంగా వీచాయని స్థానికులు తెలియజేశారు. ఎక్కువ మంది నోట్లను ఏరుకోవడంలో నిమగ్నం కాగా కొంత మంది ఆ దశ్యాలను తమ తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ఆకాశం నుంచి దాదాపు ఐదు లక్షల పౌండ్లు విలువైన కరెన్సీ కురిసినట్టు వెల్లడించిన అధికారులు మాత్రం అలా కాసులు కురవడానికి కారణం ఏమిటో ఈ రోజుకు వెల్లడించలేక పోతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : money rain  r 4.81 crores from sky  

Other Articles