బాలీవుడ్ కండలవీరుడు, అగ్రనటుడు సల్మాన్ ఖాన్పై కొనసాగుతున్న అక్రమ ఆయుధం కేసులో తుది తీర్పును జోధ్పూర్ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో ఇవాళ న్యాయస్థానం తుది తీర్పును వెలువరిస్తుందన్న వార్తలతో కోర్టు ప్రాంగణం మొత్తం జనసంద్రంగా మారింది. కాగా తుది తీర్పను మార్చి 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు బుధవారం న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసు విచారణ నిమిత్తం వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని సల్మాన్ తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు.
కాగా స్మలాన్ ఖాన్పై తుది తీర్పు వెలువడుతుందన్న నేపథ్యంలో బాలీవుడ్ లోని నిర్మాతల గుండెళ్లో రైలు పరిగెడుతున్నాయి. ప్రస్తుత్తం సల్మాన్ ఖాన్ నటిస్తున్నపలు చిత్రాలకు సంబధించి ఆయనపై బాలీవుడ్ సుమారు 200 కోట్ల రూపాయలను వెచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనకు శిక్ష ఖరారైతే.. తమ పరిస్థితి ఏంటని నిర్మాతలు జంకుతున్నారు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం గుజరాత్ రాజ్ కోట్ సమీపంలోని సూరజ్ భర్జత్య చిత్రం గోండాల్ ప్రాంతంలో ప్రేం రతన్ ధన్ పాయో షూటింగ్ లో వున్నారు. ఈ చిత్రం త్వరలోనే పోస్టు ప్రోడక్షన్ పనులకు వెళ్లనుంది. కాగా ఎక్ థ టైగర్ చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్ దర్శకత్వంలో మరో చిత్రం భజరంగీ, భజరందీ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే సెట్స్ సై నుంచి పోస్టు ప్రోడక్షన్ పనులను జరుపుకుంటోంది.
ఈ రెండు చిత్రాలకు సంబంధించి చెరో 75 కోట్ల రూపాయలను ఇప్పటికే నిర్మాతలు వెచ్చించారని, మరో రెండు చిత్రాలకు సంబంధించి 50 కోట్ల రూపాయలను కూడా సల్మాన్ తో సినిమాకు ఖర్చు చేశారని, ఈ తరుణంలో సల్మాన్ ఖాన్ పై వున్న కేసులలో తుది తీర్పు వస్తే నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా ఒక వేళ సల్మాన్ ఖాన్ కు శిక్షను ఖరారు చేసినా.. అప్పీల్ కు వెళ్లే అవకాశం కూడా వుందని.. దీంతో నిర్మాతలు అధైర్య ంపడటం లేదని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
1998లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా నిర్మాణ సమయంలో రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో సల్మాన్ ఖాన్, సోనాలి బెంద్రె, టబు, నీలమ్ తదితరులు రక్షిత జంతువైన కృష్ణజింకను వేటాడారంటూ అప్పట్లో కేసు నమోదైంది. కృష్ణ జింకల వేటతో పాటు అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నారంటూ సల్మాన్‌ఖాన్‌పై రెండు వేర్వేలు కేసులు నమోదైయ్యాయి. ఈ రెండు కేసుల్లో ఒక దాంట్లో సంవత్సరం, మరో కేసులో ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more