Stunning selfie at mars show nasas curiosity

nasa, curiocity, mars, selfie

The selfie scene is assembled from dozens of images taken by the Mars Hand Lens Imager (MAHLI) camera on the rover's robotic arm, NASA said. Pahrump Hills is an outcrop of the bedrock that forms the basal layer of Mount Sharp, at the centre of Mars' Gale Crater.

మనుషులు మాత్రమేనా.. క్యురియాసిటి కూడా సెల్ఫీ దిగుతుంది

Posted: 02/25/2015 04:45 PM IST
Stunning selfie at mars show nasas curiosity

సెల్ఫీ అంటే ప్రపంచంలో ఎంత క్రేజ్ నడుస్తుందో చెప్పనక్కర్లేదు. సెలబ్రెటీలు తీసుకునే సెల్ఫీలకైతే విపరీమైన క్రేజ్ ఉంది. రకరకాల సెల్ఫీలను నెట్ లొ అప్ లోడ్ చేస్తూ, లైక్ లు ఎన్ని వస్తాయా అని లెక్కించే వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే మనుషులు సెల్ఫీ దిగడం మామూలే కానీ జీవం లేని ఓ యంత్రం సెల్ఫీ దిగితే ఎలా ఉంటుంది. అసలు భూమి మీద కాకుండా వేరే గ్రహం మీద సెల్ఫీ తీసుకుంటే ఎలా ఉంటుంది. ఏంటీ వేరే గ్రహమా అని ఆశ్చర్యపోకండి. ఇది సాధ్యమే. తానూ ఒ సెల్ఫీ దిగి తన ట్వీట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది ఓ శాటిలైట్. అసలు ఈ సెల్ఫీ గోల ఏంటీ అనుకుంటున్నారా, అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

అంగారక గ్రహంపై వాతావరణాన్ని అధ్యయనం చెయ్యడానికి నాసా పంపిన ఉపగ్రహం క్యురియాసిటి. అరుణగ్రహం మీద వాతావరణానికి, భూమి వాతావరణానికి ఉన్న తేడాలను, పోలికలను గుర్తించడమే కాకుండా అక్కడ ఉన్న నీరు, ఖనిజాలు వంటి వాటి గురించి సమాచారాన్ని చేరవేస్తోంది. ఇలా ప్రపంచానికి ఎంతో విలువైన సమాచారాన్ని పంపుతున్న క్యురియాసిటి ఇప్పుడు తను అంగారక గ్రహం మీద దిగిన సెల్ఫీని పోస్ట్ చేసింది. అదేంటి క్యురియాసిటి సెల్ఫీ ఎలా దిగిందా అనేగా అనుమానం. క్యురియాసిటికి ఏర్పాటు చేసిన చాలా కెమెరాలు తీసిన వివిధ ఫోటోలను కలిసి, ఈ సెల్ఫీని తయారు చేశారు. ఇలా సెల్ఫీని తయారుచేసి దాన్ని ట్వట్టర్ లో పోస్ట్ చేశారు. నేను సెల్ఫీ తీశాను, కానీ సెల్ఫీలో నా చేతు కనిపించడం లేదు అంటు చేసిన కామెంట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. మొత్తానికి క్యురియాసిటి సెల్ఫీ ఇప్పుడు వార్తలకెక్కింది.ఆ ఫోటోలు, కామెంట్లు మీ కోసం...

selfie

-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nasa  curiocity  mars  selfie  

Other Articles