కేంద్రప్రభుత్వం తొలిసారిగా పూర్తిస్థాయి రైల్వే బడ్జెట్టును ప్రవేశపెడుతున్న తరుణంలో విశాఖవాసుల చిరకాలవాంఛ ప్రత్యేక రైల్వే జోన్ కు మోక్షం లభించనుందా..? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. సమైక్యరాష్ట్రంలో తమ గళాన్ని వినిపించినప్పటికీ లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనతో కొత్త ఏర్పాటైన నవ్యాంధ్రలో విశాఖవాసుల కోరికను తీర్చాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఇప్పటికే నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుసహా విశాఖ పార్లమెంట్ సభ్యుడు హరిబాబు, విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ తీసుకొస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో తమకు ప్రత్యేక రైల్వే జోన్ లభిస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతిరోజు విశాఖనుంచి సాగే రైలు ప్రయాణాలు కార్గోల్లో అధిక ఆదాయం లభిస్తున్నప్పటికీ అవి ఒరిస్సాలోని రైల్వే జోన్ కిందకు వెళ్లడంతో తమకు ఒరిగిన లాభం ఏమీలేదని విశాఖవాసులు గత కొన్నేళ్లుగా తమ వేదనను కేంద్రానికి విన్నవిస్తున్నారు. రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా తమకు ప్రత్యేక రైల్వేజోన్ వస్తుందని విశాఖవాసులు ఆకాంక్షిస్తున్నారు.
సమైక్యరాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న హయాంలో బీజం నాటుకున్న ఎంఎంటీఎస్ రైళ్లు.. తొలుత నష్టాలను చవిచూసినా క్రమంగా లాభాలబాట్లలో సాగాయి. రెండోదశ ఎంఎంటీఎస్ శంషాబాద్ నుంచి వికారాబాద్ వరకు పొడిగిస్తామని అప్పట్లో చంద్రబాబు చెప్పిన మాటలు ఇప్పటికీ అక్షరరూపం దాల్చలేదు. వైఎస్ హయాంలో ఆరేళ్లపాటు ఎంఎంటీఎస్ విస్తరణ పనులు సాగుతున్నాయనే వార్తలతోనే సరిపోగా.. ఆ తర్వాత రాష్ట్రంలో విభజన రాజకీయాల నేపథ్యంలో ఈ ఊసునే నాయకులు మర్చిపోయారు. కాగా.. ఈసారైనా రెండోదశ ఎంఎంటీఎస్ పనులకు మోక్షం లభిస్తుందని హైదరాబాద్ సహా శివారుప్రాంతాల ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more