భారతీయ సమాజంలో రైల్వేలు జీవనాడులని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు అన్నారు. 2015-16 సంవత్సరానికి సంబంధించిన రైల్వే బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికుల కోసం టోల్‌ఫ్రీ నెంబరు 138ను రైల్వే మంత్రి ప్రవేశపెట్టారు. ఈ నెంబరు 24 గంటలు పనిచేస్తుందని తెలిపారు. మహిళల భద్రతకు సంబంధించిన అంశాల కోసం మరో టోల్‌ఫ్రీ నెంబరు 132ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైల్వే వ్యవస్థలోనూ స్వచ్ఛభారత్‌కు ప్రాధాన్యత ఇస్తామని రైల్వే మంత్రి సురేష్ ప్రభు తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. రైల్వే స్టేషన్ల శుభ్రతకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్తగా బయో టాయిలెట్స్ ప్రవేశపెడుతున్నామని, ప్రస్తుతం రైళ్లలో ఉన్న టాయిలెట్ల స్థానంలోనూ బయోటాయిలెట్స్ ఏర్పాటుచేస్తామని చెప్పారు. రైళ్లు ప్రయాణికులకు కదిలే ఇళ్ల లాంటివని ప్రయాణికులలో అవగాహన కల్పిస్తామని, వాటిని శుభ్రంగా వుంచాల్సిన బాధ్యత కూడా తమపై వుంది ప్రయాణికులకు అవగాహన కల్పించి ప్రచారం నిర్వహిస్తామని సురేష్ ప్రభు తెలిపారు.
ప్రయాణికుడు 5 నిమిషాల్లో టికెట్ కొనుక్కునేలా మిషన్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. 2015-16 సంవత్సరానికి సంబంధించిన రైల్వే బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు.
డెబిట్ కార్డుతో రైల్వేసేవలు పొందేలా అన్ని స్టేషన్లలో ఏర్పాట్లు చేస్తామని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించారు. 2015-2016 సంవత్సరానికి రైల్వే బడ్జెట్‌ను సురేశ్ ప్రభు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం రైల్వే మంత్రి బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. 2015-16 రైల్వేబడ్జెట్ భవిష్యత్‌కు అద్దం వంటిదని పేర్కొన్నారు. దేశ ఆర్థికవ్యవస్థతో రైల్వేలు మమేకమైవున్నాయని తెలిపారు.మూడు సూత్రాల ఆధారంగా రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. 2015-16 సంవత్సరానికి సంబంధించిన రైల్వే బడ్జెట్‌ను ఆయన ప్రవశపెట్టారు. రైలు వేగాన్ని కూడా పెంచుతామని చెప్పారు.
రైల్వే బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యంశాలు
* రైళ్ల రాకపోకల వివరాల కోసం ప్రయాణికులకు ఎస్ఎంఎస్ సౌకర్యం.
* రైళ్లలో అతి తక్కువ ధరకే 'రైల్‌నీర్' మంచినీరు.
* డెబిట్ కార్డుతో రైల్వేసేవలు పొందేలా అన్ని స్టేషన్లలో ఏర్పాట్లు
* 108 రైళ్లలో ఇ-కేటరింగ్ సదుపాయం
* మరుగుదొడ్లను ఆధునీకరించేందుకు ప్రాధాన్యం.
* రైళ్లలో అత్యుత్తమస్థాయి పరిశుభ్రతకు ప్రాధాన్యం.
* రైల్వేల అభివృద్ధి కోసం సామాజిక మాధ్యమాల్లో 20వేల సూచనలు వచ్చాయి.
* రానన్న ఐదేళ్లలో రూ. 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.
* ప్రయాణికుల విశ్వాసాన్ని చూరగొనడం, సురక్షితమైన ప్రయాణం, ఆధునీకరణ, రైల్వేల ఆర్థికస్వావలంబన లక్ష్యాలుగా బడ్జెట్ ను నిర్ధేశించాం
* స్వచ్ఛభారత్ కూడా మా ప్రధాన లక్ష్యాల్లో ఒకటి
* బయోటాయెలెట్స్కు ప్రాధాన్యం
* ప్రజలే మా నిజమైన ఆస్తి
* గేజ్ మార్పిడి, విద్యుద్దీకరణలపై దృష్టి
* రైళ్లలో సమయపాలన పాటింపు
* ప్రయాణికుల సంఖ్యను మూడు కోట్లకు పెంచుతాం
* స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియాకు ప్రాధాన్యం.
* దీర్ఘకాల భవిష్యత్‌కు మార్గాలు వేసేది మా బడ్జెట్
* భారతీయ రైల్వేలపై శ్వేత పత్రం ఇచ్చాం.
* 2030 నాటికి రైల్వే విజన్ డాక్యుమెంట్ సమర్పించాం.
* భారతీయ రైల్వేలు కలకాలం మనగలగాలంటే పెట్టుబడులు అవసరం.
* రైళ్లు, లైన్ల ఆధునీకీకరణ ద్వారానే వేగం పెంచగలం.
* రైళ్ల వేగం తగినంతగా పెరిగినప్పుడే అభివృద్ధి సాధ్యం
* ప్రజలకు రైల్వేలపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.
* రాజధాని, శతాబ్ది రైలు 170 కి.మీ. వేగంలో మాత్రమే ప్రయణించగలవు.
* రైల్వేల్లో పెట్టుబడుల ద్వారా ఉద్యోగాలు ఎన్నో ఉద్యోగాలు కల్పించవచ్చు.
* రైల్వే సరకు రవాణా వ్యవస్థ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటింది.
* రైల్వే సరకు రవాణాను ప్రపంచస్థాయి ప్రమాణాలకు తీసుకురావాల్సి ఉంది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more