Pakistan providing all facilitys to terrorist lakhvi

pakistan, terrorist, lakhvi, isi, jihad, india, mumbai, taj hotels, jail,

pakistan providing all facilitys to terrorist lakhvi. lakhvi who has attcked on mumbai taj hotel, the pakistan jail officers providing all facilitys to him. he his in ravalpindi jail at present.

రాచమర్యాదలు అనుభవిస్తున్న ఉగ్రవాది లఖ్వీ

Posted: 03/02/2015 09:22 AM IST
Pakistan providing all facilitys to terrorist lakhvi

ముంబై మారణకాండకు కారణమైన ఉగ్రవాది  లఖ్వీకి పాకిస్థాన్ రాచ మర్యాదలు చేస్తోందని సమాచారం.  ఇంటర్నెట్, మొబైల్, టీవీ సదుపాయాలు విలాసవంతమైన జీవితాన్ని అక్కడి పాక్ జైళ్ల సిబ్బంది అందజేస్తున్నారు. ఎవరు ఎప్పుడు ఆయనను కలవడానికి వచ్చినా ఎలాంటి అభ్యంతరాలు తెలపకుండా అనుమతిస్తున్నారు. కిడ్నాప్ తదితర కేసుల విచారణ నిమిత్తం లఖ్వీ రావల్పిండి అడియాలా జైల్లో ఆరేండ్ల నుంచి ఉంటున్నాడు. 2008లో ముంబైలో జరిగిన బాంబుపేలుళ్లకు ఇతడే ప్రధాన సూత్రదారని ఆరోపణలు ఉన్నాయి.


ఇటీవల లఖ్వీకి స్థానిక న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిర్ణయించగా భారత్ నుంచి తీవ్ర నిరసన వెల్లువెత్తింది. దీంతో వెనక్కి తగ్గిన పాక్ ప్రభుత్వం లఖ్వీని మళ్లీ జైలుకు పంపింది. ప్రస్తుతం జైల్లో లఖ్వీ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. రాజభోగాలు అనుభవిస్తున్నాడు. రోజూ ఫోన్‌లో తన లష్కరే తోయిబా అనుచరులతో సంభాషిస్తున్నాడు. ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నాడు. ప్రత్యేకంగా తనకోసం టీవీని ఏర్పాటు చేయించుకున్నాడు. తనను ఎవరు ఎప్పుడు కలవడానికి వచ్చినా అది పగలైనా రాత్రయినా వారికి జైలు సిబ్బంది అనుమతిచ్చేలా ఏర్పాట్లు చేయించుకున్నాడు. రోజుకు వందమంది ఆయనను కలిసేందుకు వస్తున్నారట. ఈ విషయాన్ని బీబీసీ ఉర్దూ మీడియా బయటపెట్టంది. ఒక ఉగ్రవాదికి జైలు సిబ్బంది ఇలాంటి సపర్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan  terrorist  lakhvi  isi  jihad  india  mumbai  taj hotels  jail  

Other Articles