Mary kom decides to quit boxing after rio olympics

mary kom news, mary kom boxer, mary kom history, mary kom latest news, mary kom photos, mary kom movie, mary kom medals

Mary Kom decides to quit boxing after Rio Olympics : Indian woman boxer mary kom has finally decided to quit boxing after 2016 rio olympics. Because she feels so tired.

సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్న ‘మేరీ కోమ్’!

Posted: 03/02/2015 09:00 PM IST
Mary kom decides to quit boxing after rio olympics

ప్రముఖ మహిళా బాక్సర్ మేరీ కోమ్ గురించి తెలియని వారూ ఎవరు వుండరు. ఐదుసార్లు ‘వరల్డ్ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్’గా నిలిచింది. అంతేకాదు.. 2012 సమ్మర్ ఒలంపిక్స్ లో మొట్టమొదటి భారతీయ మహిళా బాక్సర్ గా అర్హత సాధించి, ఆ పోటీల్లో బ్రాంజ్ మెడల్ గెలిచింది. ఇక 2014లో జరిగిన ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన మొదటి భారతీయ మహిళగా రికార్డు సాధించింది. వీటితోపాటు మరెన్నో పురస్కారాలు ఈమెను వరించాయి. ఇంతటి ఘనచరిత్రను కలిగిన మేరీ కోమ్.. తాజాగా ఓ సంచలనాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుని... దేశాన్ని సందేహంలో ముంచెత్తింది.

‘‘సుదీర్ఘకాలంగా బాక్సింగ్ ఆడి చాలా అలసిపోయాను.. ఒలంపిక్స్ తర్వాత క్రీడకు గుడ్ బై చెబుతా’’ అంటూ వెల్లడించింది మేరీ కోమ్! 2016 రియో డీ జెనీరోలో జరగనున్న ఒలంపిక్స్ కోసం అవిశ్రాంతిగా ప్రాక్టీస్ చేస్తున్న ఆమె.. ఆ క్రీడల తర్వాత విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. బాక్సింగ్ క్రీడ సుదీర్ఘకాలం ఆడి అలసిపోయానని, ఆ క్రీడను మరికొన్నికాలాలపాటు కొనసాగించేందుకు తన వయసు కూడా అడ్డంకిగా మారుతుందని ఆమె పేర్కొంది. అందుకే.. తాను విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నానని తెలిపిన ఆమె.. ఒలంపిక్స్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తానని స్పస్టం చేసింది.

అయితే.. మేరీ కోమ్ తీసుకున్న ఈ నిర్ణయానికి దేశం మొత్తం సందేహంలో పడిపోయింది. మేరీ కోమ్ లాంటి దిగ్గజ బాక్సర్ రిటైర్మెంట్ తీసుకుంటే.. ఆమెలాగే బాక్సింగ్ అద్భుతంగా రాణించే మరొకరు ఎవరున్నారు..? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ప్రస్తుతమున్న ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా మేరీ తీసుకున్న నిర్ణయం మంచిదేనని ప్రముఖులు వెల్లడిస్తున్నారు. 32 ఏళ్ల వయసున్న మేరీ కోం ఇద్దరు బిడ్డల తల్లి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mary kom controversies  indian woman boxer  

Other Articles