Gali janardhan reddy in illegal facebook accounts issue

Gali Janardhan Reddy in illegal facebook accounts issue, janardhan reddy personal secretary reported to cbi, bengaluru police investigating janardhan reddy case, gali janardhan reddy facebook account, gali janardhan reddy illegal facebook account holders, Gali Janardhan Reddy, facebook, bengaluru police, CBI, mining baron Gali Janardhan Reddy,

bengaluru police haunting for the Gali Janardhan Reddy illegal facebook account holders

ఆ అకౌంట్లతో తనకు సంబంధం లేదన్న ‘గాలి’

Posted: 03/03/2015 02:44 PM IST
Gali janardhan reddy in illegal facebook accounts issue

కర్ణాటక మాజీ మంత్రి, ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో అక్రమాల నేపథ్యంలో నిందితుడిగా భావిస్తున్న ఓఎంసీ యజమాని గాలి జనార్థన్ రెడ్డికి ఆ అకౌంట్లతో సంబంధం లేదట. అదేంటి ఆయన చెబితే సీబీఐ ఎలా విశ్వసిస్తుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబిఐ అకౌంట్లను నిగ్గుతేల్చాలి కదా అన్న అనుమానం కలుగుతుందా..? అంతలా ఊహించుకోకండి ఎందుకంటే అది బ్యాంక్ అకౌంట్లు కాదు. అది ఫేస్ బుక్ అకౌంట్లు. గాలి జనార్థన్ రెడ్డి పేరుతో నకిలి ఫేస్‌బుక్ అకౌంట్లు, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో అకౌంట్లు ఓపెన్ చేసి వాటిలో పిచ్చి రాతలు రాస్తున్నారని, వాటితో తనకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు గాలి జనార్థన్ రెడ్డి పర్సనల్ సెక్రటరీ బి శివకుమార్ ఇటీవల బెంగళూరులోని సీఐడీ కార్యాలయంలో నకిలీ ఫేస్‌బుక్‌ల పైన ఫిర్యాదు కూడా చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ అకౌంట్లు తెరచిన వారిని  గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే పలువురిని అనుమానితులుగా భావిస్తున్న పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

గాలి జనార్ధన్ రెడ్డి అభిమానుల సంఘం, రెడ్డి అభిమానుల సంఘం, గాలి జనార్ధన్ రెడ్డి తదితర పేర్లతో నకిలీ పేస్‌బుక్ అకౌంట్లు దర్శనం ఇచ్చాయి. అయితే ఈ అకౌంట్లలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పేరుతో ఫేస్‌బుక్‌లో ఇష్టం వచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేసి తన పరువు తీస్తున్నారని గాలి జనార్ధన్ రెడ్డి తన పీఏ శివకుమార్ ద్వార సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. గాలి జనార్ధన్ రెడ్డి పేరు మీద నకిలి ఫేస్‌బుక్ అకౌంట్లు ప్రారంభించి అనుచతితంగా పోస్టు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని గాలి పీఏ శివకుమార్ సీఐడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. గాలి జనార్ధన్ రెడ్డి జైలులో ఉన్న సమయంలో ఈ నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లు ఓపెన్ చేశారని, ఎన్ని అకౌంట్లు ఉన్నాయనేది ఆరా తీస్తున్నామని సీఐడీ పోలీసులు చెబుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gali Janardhan Reddy  facebook  bengaluru police  CBI  

Other Articles