ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో ఢిపెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగని ధోణి సేన.. వెస్టీండీస్ తో మ్యాచ్ లో బాగా రాణిస్తోంది. భారత బౌలింగ్ సరిగా లేదని విమర్శలు ఎదుర్కోన్న బౌటర్ల దాటికి విండీస్ అగ్రశ్రేణి బ్యాట్స్ మెన్లు కూడా కుదేలయ్యారు. పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, యూఏఈ జట్లను మట్టికరిపించిన తరువాత విండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో పది ఓవర్లకే విండీస్ పీకల్లోతు కష్టాలలో పడింది. పది ఓవర్లలో 3.8 రన్ రేట్ తో 38 పరుగులు సాధించిన విండీస్.. నాలుగు టాప్ ఆర్డర్ విక్కెట్లను కోల్పోయింది.
విండీస్ అత్యంత విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ 8 వ ఓవర్ లో 21 వ్యక్తిగత పరుగుల వద్ద అవులవ్వడంతో టీమిండియా బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. గ్రూప్-బీలో భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ కు దిగింది. క్రిస్ గేల్, డ్వేన్ స్మిత్ ఓపెనర్లుగా వచ్చారు. టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ కొత్త బంతి అందుకున్నాడు. ముందు నుంచి ఆచితూచి ఆడుతున్న విండీస్ ఓపెనర్ డ్వేన్ స్మిత్(6) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ఐదవ ఓవర్లో మహ్మద్ షమీ బౌలింగ్ లో వికెట్ కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
కాగా క్రిస్ గేల్ కు భారత ఆటగాడు ఉమేష్ యాదవ్ లైఫ్ ఇచ్చాడు. 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గేల్ ఇచ్చి క్యాచ్ ను ఉమేష్ వదిలేశాడు. మహ్మద్ షమీ బౌలింగ్ లో గేల్ కొట్టిన షాట్ కు బంతి బౌండరీ దాటేట్టు కనబడింది. అయితే పరిగెత్తుకుంటు వచ్చినా ఉమేష్ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. బంతిని పట్టుకుని కిందపడిపోయాడు. అతడు కిందపడిన తర్వాత చేతిలోని బంతి జారిపడింది. దీంతో గేల్ బతికి పోయాడు. ఆ తరువాత 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉమేష్ బౌలింగ్ లో ఇచ్చిన మరో క్యాచ్ ను పట్టుకునేందుకు షమీ విఫలయత్నం చేశాడు. దీంతో గేల్ ను రెండు లైఫ్ లు లభించాయి. ఆ తరువాత షమీ బౌలింగ్ లో షాట్ కోట్టిన గేల్.. మోహిత్ శర్మకు క్యాచిచ్చి వెనుదిరిగాడు.
ఆ తరువాత తొమ్మిద ఓవర్లో నాలుగో విక్కెట్ పడింది. ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో రామ్ దిన్ డౌకౌట్ అయ్యి పెవీలియన్ దారి పట్టాడు.. గేల్ కన్న ముందు వన్ డౌన్ లో వచ్చిన శామ్యూల్స్ కూడా పరుగులేమీ చేయకుండానే రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం 14 ఓవర్లలో 51 పరుగులు చేసిన విండీస్ ఆచి తూచి ఆడుతుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more