Husbands wives celebrates doond ceremony

husbands wives celebrates doond ceremony, wives beat thier husband with sticks, Husbands beat, doond ceremony, Women, Men, Wives, doond ceremony in Khammam, khammam tribal festival doond, tribal traditional festival doond, tribal fest,

wives celebrating doond ceremony by beating thier husband with sticks in Khammam

భర్తలను జింతా త థా చేస్తున్న భార్యామణులు

Posted: 03/06/2015 01:28 PM IST
Husbands wives celebrates doond ceremony

ఖమ్మం జిల్లాలో హోలీ పర్వదిన సందర్భంగా జరిగే డూండ్ పండగలో అక్కడి భార్యమణులు వారి భర్తలను పచ్చి కర్రలతో కోట్టి తరుముతుంటారు. వినడానికే విచిత్రంగా వున్నా.. ఇది ముమ్మాటికీ నిజం. పండగల రోజున భర్తల ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు తీసుకునే భార్యమణులు ఉన్న భారతవనిపై.. భర్తల భరతం పట్టే భార్యమణులు వున్నారంటే నమ్మకం కలగడం లేదా..? కానీ ఇది నిజం. హోలీ పండగ నేపథ్యంలో కోనసాగే ఈ గిరిజన సంప్రదాయ వేడుకలో పచ్చి బరిగలతో మహిళలు వారి భర్తలను ఇరగదీస్తుంటారు.

భార్యమణులు దెబ్బల భారి నుంచి తప్పించుకునేందుకు మీసం మెలేసే భర్తలు పరుగులు తీస్తారు. శారీరకంగా మంచి దేహదారుఢ్యం వున్నవారమని వీర్రవీగిన వారికి పచ్చి బరిగెల దెబ్బలతకు వాతలు తేలాయి. గిరిజన సంప్రదాయ వేడుకల్లో ఒకటైన డూండ్ క్రీడ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సామ్య తండాల్లో ఉత్సాహంగా నిర్వహించారు. హోలీ వేడుకల్లో భాగంగా అనాధిగా వీరు ఈ క్రీడను జరుపుకుంటున్నారు. భార్యలు భర్తల్ని కర్రలతో చితకబాదే ఈ క్రీడ ఆద్యంతం ఆసక్తిదాయకంగా, అహ్లాదకరంగా కోనసాగింది.
 
గిరిజన వేడుక డూండ్ అర్థమేంటి..?

డూండ్ అంటే వెతకడం అని అర్థం. గత ఏడాది హోలీ నుంచి ఈ హోలీ రోజుకు మధ్య కాలంలో తండాలో జన్మించిన మగ పిల్లాడిని సంప్రదాయ బద్ధంగా ఈ హోలీ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు గేరినీ(మహిళలు)లు తండాలో ఒక చోట దాచి పెడతారు. ఇక తండాలోని గేర్యాలు(పురుషులు) కర్రలు చేతబట్టి ఆ పిల్లవాడిని ఎక్కడ దాచారో డూండ్(వెతకడం) చేస్తారు. పిల్లవాడు దొరికాకా గేర్యా, గేరినీలు కామదహనం చేసి రంగులు పూసుకుంటారు. అనంతరం సాయంత్రం కుమారుడి ఇంటి వద్ద ఒక స్థూపం (గుంజ) చుట్టు తినుబండరాలను గంగాళాల్లో( బకెట్లు) ఉంచి తాళ్లతో వాటిని ఒకదానికొకటి బిగించి వాటి చుట్టు గేరినీలు పచ్చి బరిగలు చేతబూని  కాపలా ఉంటారు.

ఇక వాటిని తీసుకుని వెళ్లడానికి గేర్యాలు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో గేరినీలు వారిని కర్రలతో కొడుతూ పాటలు పాడుతూ ఆ స్థూపం చుట్టూ తిరుగుతుంటారు. దీంతో ఆ ప్రాంతమంతా ఒకరకమైన సందడినెలకొంటుంది. ఎవరైతే గేరినీలను చేధించుకుని ఆ గంగాళాలను ఎత్తుకొస్తారో వారిని ఆ తండాలో ధీరుడిగా గుర్తిస్తారు. అనంతరం ఆ తినుబండరాలను  గేర్యా, గేరినీలు రెండు వాటాలుగా వేసుకొని కామదహనం చేసిన ప్రాంతానికి వెళ్లి దాన్ని చల్లార్చి ఆ పక్కనే ఉన్న పోల్లాలో ఆరగిస్తారు. దీంతో డూండ్ వేడుక ముగస్తుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Husbands beat  doond ceremony  Women  Men  Wives  

Other Articles