Australia sets 376 runs target against sri lanka

Glenn Maxwell Smashes Second-Fastest World Cup Century, Glenn Maxwell, Srilanka versus Australia, Srilanka vs Australia, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Srilanka, Srilanka CWC 2015, Live Scores, Live Updates, Australia, Australia CWC 2015, Sports, World Cup Live

Sri Lanka won four and lost two out of their last eight matches against Australia at the Sydney Cricket Ground

శ్రీలంక ముందు 376 పరుగుల భారీ విజయలక్ష్యం..

Posted: 03/08/2015 12:26 PM IST
Australia sets 376 runs target against sri lanka

క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా 377 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ఎదుట ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా మాక్స్‌వెల్(102), స్మిత్(72), కెప్టెన్ మైకేల్ క్లార్క్(68) వాట్సన్(67) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 376 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 19 పరుగులకే వార్నర్ వికెట్‌ను, 41 పరుగుల వద్ద ఫించ్ వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్, క్లార్క్‌లు మరో వికెట్ పడకుండా ఆదుకున్నారు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ హాఫ్ సెంచరీలను సాధించారు.

68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్లార్క్... మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే 177 పరుగుల వద్ద స్మిత్(72) వికెట్‌ను కూడా ఆసీస్ కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన మాక్స్‌వెల్ లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 51 బంతుల్లో 100 పరుగులు చేసి తాజా ప్రపంచకప్‌లో రెండో వేగవంతమైన శతక రికార్డును తన పేరున రాసుకున్నాడు. సెంచరీ సాధించిన వెంటనే మాక్స్ వెల్ ఔటయ్యాడు. ఆ తరువాత వచ్చిన ఫాల్కునర్ కూడా వెంటెనే పెవీలియన్ ముఖం పట్టాడు. మరోపక్క వాట్సన్ కూడా అర్ధశతకంతో దూకుడు పెంచాడు. 368 పరుగుల వద్ద వాట్సన్(67), 373 పరుగుల వద్ద హడిన్(25), స్టార్క్(0) లు ఔటవ్వగా, దోహర్తి 0(1), జాన్సన్3(3) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. లంక బౌలర్లలో మలింగ, పెరీరా చెరో రెండు వికెట్లు తీయగా, మాథ్యూస్, ప్రసన్న, దిల్షాన్ తలో వికెట్ తీశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  Australia  Srilanka  

Other Articles