Is it first and last rape case in india

nirbhaya, delhi, gangrape, mukesh, media, daughterofindia, bbc,

india faces many nirbhayas in its history. but only delhi nirbhaya incident got popular in media. every indian rising their hands to oppose the nirbhaya incident.

ప్రత్యేకం: దేశంలో మొదటి, చివరి అత్యాచారం నిర్భయేనా?

Posted: 03/10/2015 04:49 PM IST
Is it first and last rape case in india

భారతదేశంలో ఓ ఉద్యమం ఉప్పెనలా వెలిసింది. అప్పటి దాకా ఏమీ పట్టినట్లు ఉన్న జనం నేడు రోడ్ల మీదకు వస్తున్నారు, నవ భారతానికి ఇది కొత శకం. మహిళల గౌరవానికి, రక్షణకు కొత్త నిర్వచనం దొరుకుతుంది- ఇలా మీడియాలో పుంకాను పుంకాలు వార్తలు నిర్భయ ఘటన నేపథ్యంలో వచ్చాయి. ఢిల్లీ వీధుల్లో వేల మంది జనాలు, ఓ భారతీ స్ర్తీకి అన్యాయం జరిగింది అంటూ నినాదాలు చేశారు. ఆడది అంటే అవకాశం కాదు అంటూ నినాదాలు ఆకాశాన్నంటాయి. ఆడవారికి ఇక ముందు ఎన్నటూ ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి చట్టాలను తీసుకురావాలని దేశ వ్యాప్తంగా నిరసనలు వెలిశాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఈ నిరసనల్లో పాల్గొన్నారు. నిజంగా ఇది మంచిదే, కానీ నిర్భయ ఉదంతం ఎందుకు అంత ఉద్యమానికి కారణమైంది. అసలు అప్పుడు ఏం జరిగింది. నిర్భయ ఘటన తరువాత ఏం జరిగింది. అన్నీ వివరాలు మీ కోసం...

స్నేహితుడితో కలిసి రాత్రి పూట సెకండ్ షో సినిమా చూసి వస్తున్న ఓ వైద్య విద్యార్థినిపై కొందరు వ్యక్తులు అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఐదు గురు మానవ మృగాలు, ఆమెను అత్యాచారం చేశారు. అత్యాచారంతో వదలకుండా ఆమెకు నరకం చూపారు. అసలు ఆమె కూడా మనిషే అన్న విషయాన్ని మరిచి, తమ కౄరత్వాన్ని ప్రదర్శించారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న ఆమెను తరువాత బస్సులోంచి తోశారు. తరువాత ఆమె పరిస్థితి విషమించడం, విదేశాల్లో వైద్యం చేయించినా పరిస్థితి మారక, చివరికి మరణించింది.

అయితే ఈ ఘటనలో మరణించిన ఆమెకు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. అన్ని రాష్ట్రాలు, అన్ని వర్గాలు, అందరు దీన్ని తీవ్రంగా ఖండించారు. కాగా మీడియా ఇదే విషయాన్ని మరింత హైలేట్ చేసింది జాతీయ మీడియా. ఒక్క జాతీయ మీడియానే కాదు అంతర్జాతీయ మీడియా సైతం భారతదేశంలో ఓ ఉద్యమం ఉప్పెనలా సాగుతోంది అంటూ రకరకాల కథనాలను ప్రచారం చేసింది. అయితే కొందరు ఘటనకు స్పందించి ముందుకు వస్తే, కొందరు మాత్రం మీడియా కోసం ముందుకు వచ్చారు. అందరు కలిసి ఘటనను తీవ్రంగా ఖండించారు. జాతీయ మీడియాలోని కొన్ని ఛానల్లు ఈ ఘటన నేపథ్యంలో జరిగే ఎలాంటి కార్యక్రమానికైనా, నిరసనలకైనా విపరీతమైన కవరేజినిచ్చింది.

చిలిచిలికి గాలి వానగా మారింది నిర్భయ ఉద్యమం. దాంతో కొందరు వ్యక్తులు మీడియాలో హైలెట్ అయ్యారు. కొందరు వ్యక్తులు మాత్రం నిర్భయ ఘటను కనీసం ప్రతిఘటించలేదు కూడా. అయితే కొంద మంది మాత్రం భారతదేశంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా స్పందించారు. వారి ప్రశ్న ఒక్కటే. అసలు నిర్భయ ఘటనకు ముందు ఒక్క సారి కూడా దేశంలో అత్యాచారం జరగలేదా? మరి ఇప్పుడు ఇదే మొదటిసారి అన్నట్లు అందరూ ఎందుకు అంతలా ఆశ్చర్యపోతున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకంటే అంతకు ముందు భారత్ లో ఎన్నో సార్లు ఎంతో మంది అత్యాచారాలకు గురయ్యారు, కానీ అప్పుడు అత్యాచార బాధితులకు గొంతు లేదు. ఎరరికీ పట్టనిది నా కెందుకులే అనే ఓ నిర్లక్షం. అప్పటి దాకా జరిగిన ఉదంతాలను కప్పి ఉంచింది.

నిర్భయ ఘటన నేపథ్యంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా వేగంగానే స్పందించింది. అత్యాచారాలపై కఠినమైన చట్టాలను తీసుకు వస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా నిర్భయ చట్టాన్ని తీసుకు వచ్చింది. అత్యాచార బాధితుల కేసులను వేగంగా పరిశీలించి, న్యాయం చెయ్యాలని న్యాయశాఖ కూడా తీర్మానించుకుంది. కానీ నిర్భయ ఘటన తరువాత ఎలాంటి ఘటనలు జరగలేదా అంటే దానికి సమాధానం ఖచ్చితంగా జరిగాయి. గతంలో కన్నా ఎక్కువే జరిగాయి. మరి ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి అంటే మీడియా చేసిన అతి. నిర్భయ నిందితులు ఎలా రేప్ చేశారు, క్యారెక్టర్లతో సహా సవివరంగా వివరించిన మీడియా, మరిన్ని అత్యాచారాలకు పురిగొల్పింది.

తాజాగా నిర్భయ నేపథ్యంలో వచ్చిన డాక్యుమెంటరీ దేశ రాజకీయాలను మరో సారి ఇబ్బంది పెట్టాయి. బిబిసి చానల్ తీసిన ఈ డాక్యుమెంటరీకి డాటర్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టారు. బారత కూతురు ఎలా అత్యాచారానికి గురైంది, తరువాత పరిస్థితులు ఏంటి అని డాక్యుమెంటరీలో చూపించాలని వారి తాపత్రయం. కానీ ఆ డాక్యుమెంటరీని ఎలా ప్రసారం చేస్తారంటూ సర్వత్రా నిరసనలు రావడంతో కేంద్రం బిబిసిని ఆపాలని కోరింది. బిబిసి మన దేశంలో తప్ప, మిగిలిన దేశాల్లో ఆ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.

అయితే డాక్యుమెంటరీలో నిందుతుడు ముకేశ్ మాటలు చాలా మందికి ఆగ్రహం తెప్పించాయి. బాధితురాలు మాకు సహకరించి ఉంటే కేవలం అత్యాచారం మాత్రం చేపి వదిలేసే వారమని, కానీ  వారిని వ్యతిరేకించడం వల్లే అలా ప్రవర్తించాల్సి వచ్చిందని అన్నారు. అయినా అమ్మాయిలు, అబ్బాయిలు సమానం అని అంటున్నారు కదా మరి మమ్మల్ని వదిలెయ్యండి అని అతను నిలదీశాడు. ఇలా అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తి వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు లేదు. ఇంకా తప్పు చేశాననే భావనే అతనికి రాలేదు. అయితే అతను అలా మాట్లాడటానికి చాలా కారణాలే ఉన్నాయి. అతను చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణం, భారత న్యాయ వ్యవప్థపై ఉన్న నమ్మకం కూడా అతన్ని అలా మాట్లాడించింది.

నిర్భయ ఘటన సమయంలో ఉన్న ఉద్యమ స్పూర్తి ఇప్పుడు ఎందుకు లేదు అన్నది ప్రశ్న. ఉద్యమం అనేది సముద్రం లాంటి ఎప్పుడూ ఆగ కూడదు, ఎన్నటికీ వాడకూడదు. కానీ మనం చేసే ఉద్యమాల్లో అలాంటివి కావు. రెండు రోజులు జై కొడితే మూడో రోజు మామూలే అంటూ గాలికి వదిలే రకం. నిజానికి నిర్భయ ఘటన తరువాత ప్రతి భారతీయుడిలో ఓ మార్పు వచ్చి ఉంటే ఇప్పటికీ వార్తల్లో అత్యాచార వార్తలు వచ్చేవి కావు. అత్యాచారం చేసిన వారు నిస్సిగ్గుగా బయట తిరిగే వారు కాదు. కానీ మనం మాత్రం మారం. అప్పటికి దేశాన్ని మార్చేస్తామంటూ మాట్లాడినా, ఉదయానికి అన్నీ మరిచి ఎవరి పనులకు వారు వెళ్లే వాళ్లం.

కానీ నిర్భయ ఘటన భారత్ లో ఓ కొత్త ఉద్యమ స్పూర్తిని పూర్తిగా నింపలేదు అని కాదు. ఇప్పటికే అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయంటే అది నిర్భయ ప్రభావమే. అయితే చట్టాలు ఎన్ని వచ్చినా, మన మైండ్ సెట్ లో మార్పులేక పోతే వాటికి విలువే ఉండదు. నిర్భయ తల్లిదండ్రులు మరే తల్లిదండ్రులకు మా లాగా కడుపుకోతకు గురి కావద్దు, అలా చట్టాలను కఠినంగా చెయ్యండి అంటూ చేసిన వినతి గాలిలో కలిసింది. తమ బిడ్డ అనుభవించిన నరకాన్ని వారు దేశ ప్రజలతో పంచుకున్న తీరు, దానికి ప్రజానీకం ఇచ్చిన స్పందన మాత్రం నిజంగా గొప్పదే. అయితే నిర్భయ ఘటనలు మళ్లీమళ్లీ ఎందుకు జరుగుతున్నాయి ఎవరి వల్ల ఈ తప్పులు మళ్లీ ఎందుకు జరుగుతున్నాయని అందరం ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించుకున్న నాడు వచ్చే సమాధానం దేశంలో మరో అత్యాచారానికి తావివ్వదు. అలాంటి రోజును భవిష్యత్ భారతం చూడాలని ఆశిద్దాం.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : nirbhaya  delhi  gangrape  mukesh  media  daughterofindia  bbc  

Other Articles