Rapist ram singh s ghost haunts his house claim locals

Dec 16 gangrape, Ram Singh, Mukesh Singh, Sant Ravi Dass Camp, nirbhaya convict, ghost in sant ravidas camp, sant ravidas camp, mirbhaya convict scare residents of Sant Ravi Dass Camp, Ramsingh still haunts the house, Ramsingh fear is thick and horror stories are galore,

convicts of the December 16 gangrape still scare residents of Sant Ravi Dass Camp, home to four of the men involved in the dastardly crime.

రాంసింగ్ దెయ్యమయ్యాడు.. ఎవర్నీ వదలపెట్టనంటున్నాడు..

Posted: 03/11/2015 06:19 PM IST
Rapist ram singh s ghost haunts his house claim locals

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ఆత్మహత్యకు పాల్పడిన దోషి రాంసింగ్ దెయ్యమయ్యాడట. అతని ఆత్మహత్యకు ముందు కుటుంబంతో సాటు ఢిల్లీలో అతడు నివసించిన ఇంట్లో ఆత్మ రూపంలో నివసిస్తూన్నడన్న వార్త చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా రాంసింగ్ చుట్టూపక్కల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. తన జోలికి వస్తే చిన్నాపెద్దా, ముసలి ముతకా ఎవ్వర్నీ వదిలిపెట్టనని హెచ్చరిస్తున్నాడు. కట్టుకథను తలపించేలా ఉన్నా ప్రస్తుతం ఢిల్లీలోని సంత్ రవిదాస్ క్యాంప్లోని మురికివాడలో ఎవరినోట విన్నా ఇదే చర్చ!

2012, డిసెంబర్ 16న కదులుతున్న బస్సులో నిర్భయపై కిరాతకంగా లైంగికదాడికి పాల్పడ్డ ఆరుగురు నిందితుల్లో ఒకడు రాంసింగ్. ఢిల్లీ వీధుల్లో కదులుతున్న బస్సులో అభాగినిపై డిసెంబర్ 16 2012 లో జరిగిన దారుణంలో అతను నిందితుడు. ఈ కేసు విచారణ సమయంలోనే తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం నలుగురు దోషులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరి శిక్ష విధించగా, బాల నేరస్తుడికి మూడేళ్ల కారాగార శిక్ష పడింది.

రాంసింగ్, అతని సోదరుడు ముఖేశ్ లు నేరానికి పాల్పడిన నాటి నుంచి వారి కుటుంబం కూడా అల్లకల్లోంగా మారింది. రాంసింగ్ ఆత్మహత్య తరువాత ఆయన కుటుంబం సొంత ప్రాంతం రాజస్థాన్ కు తరలివెళ్లింది. ఢిల్లీలో వారు నివసించిన ఇల్లు గత రెండేళ్లుగా తాళం వేసి ఖాళీగా ఉంటోంది. ఆ ఇంట్లోనే రాంసింగ్ ఆత్మ తిరుగుతోందని, చుట్టుపక్కల వాళ్లు నమ్ముతున్నారు. గల్లీల్లో ఆడుకునే పిల్లలెవ్వర్నీ ఆ ఇంటివైపు వెళ్లొద్దని తల్లులందరూ చెప్తున్నారు.  రాంసింగ్ దెయ్యంగా మారాడని అందరూ అనుకుంటున్నారు. వ్యక్తిగతంగా తాను నమ్మినా, నమ్మకపోయిన్నా పిల్లల్ని కాపాడుకోవడం తన బాధ్యత కాబట్టి ఆ ఇంటివైపు వెళ్లొద్దని చెప్తున్నాను' అని స్థానిక మహిళ ఒకరు తన అభిప్రాయపడ్డారు. బతికున్నప్పుడు కీచకపర్వానికి ఒడిగట్టిన రాంసింగ్.. చనిపోయాక కూడా దెయ్యమై జనానికి కునుకులేకుండా చేస్తున్నాడని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dec 16 gangrape  Ram Singh  evil  haunts  

Other Articles