Court order to release zaki ur rehman lakhvi

Zaki-ur-Rehman Lakhvi, 26/11 attacks, mumbai, pakistan, islamabad, high court

Zaki-ur-Rehman Lakhvi, the mastermind of the 26/11 Mumbai attacks, is likely to be released in Pakistan after a court reportedly ruled that his detention was illegal.According to media reports, the Islamabad High Court has said that he cannot be kept in prison anymore and ordered his release.

లక్వీని విడుదల చెయ్యాలంటూ కోర్టు తీర్పు

Posted: 03/13/2015 10:55 AM IST
Court order to release zaki ur rehman lakhvi

భారత్ పై దాడిలో భాగంగా ముంబాయి మారణకాండకు ముఖ్య సూత్రదారిగా భావిస్తున్న జాకిర్ ఉర్ రెహమాన్ లక్విని విడుదల చెయ్యాలంటూ ఇస్లామాబాద్ కోర్టు సంచనల తీర్పునిచ్చింది. నిర్భందంలొ ఉంచిన లక్విని వెంటనే విడుదల చెయ్యాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గత 2009 నుండి రావల్పిండి జైలులో ఉన్న లక్వీని విడుదల చెయ్యాలని గత డిసెంబర్ లో పాకిస్థాన్ ప్రయత్నించానా, భారత్ దాన్ని పూర్తిగా వ్యతిరేకించడంతో పాక్ తన ప్రయత్నాన్ని విరమించుకుంది.

అయితే ముంబాయి దాడిలో నిందుతుల్లోని ఏడు గురిలో లక్వీ కీలక సూత్రధారి అని ఆరోపణలు ఉన్నాయి. కాగా లక్వీ దోషిగా నిరూపించడానికి ఎలాంటి సాక్షాధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. తనను అక్రమంగా జైలులో నిర్భందించారని గతంలో లక్వి కోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారించిన కోర్టు, తాజాగా లక్వీ విడుదలకు మార్గం సుగమం చేసింది. అయితే 2008 లో ముంబయి తాజ్ హోటల్ పై దాడి చేసి 166 మంది చావుకు కారణమైన లక్వీని అలా ఎలా వదిలేస్తారంటూ భారత్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zaki-ur-Rehman Lakhvi  26/11 attacks  mumbai  pakistan  islamabad  high court  

Other Articles