తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులకు ఏప్రిల్ 1 నుంచి కొత్త వేతనాలు అందుతాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. 3 లక్షల మంది ఉద్యోగులకు కొత్త వేతనాలు మార్చి 1 నుంచి అమలవుతాయని చెప్పారు. మూలవేతనంలో 63.34 శాతం కరవు భత్యాన్ని,43 శాతం ఫిట్‌మెంట్‌ను 2014 జూన్ 2 నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 28 నుంచి పెంచిన జీతాల బాండ్స్‌ను ఇవ్వబోతు న్నామని, ఐదేళ్ల తర్వాత వడ్డీతో కలిపి చెల్లిస్తామన్నారు. ఫిట్ మెంట్ అమలుకు ఎన్నికల సంఘం అనుమతించిందని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా ఫిట్మెంట్ 39 శాతం మాత్రమే చెల్లించారని, తమ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా 43 శాతం ఫిట్ మెంట్‌ను ప్రకటించి చరిత్ర సృష్టించిం దన్నారు.
వాస్తవంగా 10 వ వేతన సవరణ సంఘం ఇంత మొత్తం సిఫార్సు చేయలేదన్నారు. కొత్త వేతనాలు ఉద్యోగులతో పాటు విశ్వ విద్యాలయాల్లో పని చేసే బోధనేతర సిబ్బంది, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పని చేసే వారికి కూడా వర్తిస్తుందన్నారు. పెరిగిన వేతనాలు వల్ల 6,700 ల కనీసవేతనం తీసుకునే ఉద్యోగి ఇకపై 13 వేలు తీసుకుంటారని,అదే విధంగా గరిష్టంగా 55 వేలు తీసుకునే అధికారి 1,10,850 తీసుకుంటారని ఈటెల వెల్లడించారు. పెన్షనర్లకు 3,350 నుంచి 6,500 పెరుగుతుందని,ఇంక్రిమెంట్‌ను 3 నుంచి 5 శాతానికి పెంచుతున్నట్లు పేర్కొన్నారు. వైద్య అలవెన్స్ 200 నుంచి 350కి, బోధనాఫీజు 1000 నుంచి 2,500లకు , టీఏ, డీఏ 63.34 శాతానికి పెరుగుతుందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more