Pakistan order to continues the jail for zaki ur rehman lakhvi

Zaki-ur-Rehman Lakhvi, 26/11 attacks, mumbai, pakistan, extend,

Bowing to pressure from India and US, Pakistan has decided to extend custody for Lashkar terrorist Zakiur Rehman Lakhvi. He will be behind bars for another 30 days. Lakhvi is believed to be close aide and relative of Hafeez Sayeed, who is the mastermind of 26/11 attack. Lakhvi's detention has been extended by the Punjab provincial government to maintain public order.

లక్వీ విడుదలను అడ్డగించిన పాక్.. మరో నెల పాటు జైలులోనే

Posted: 03/14/2015 01:02 PM IST
Pakistan order to continues the jail for zaki ur rehman lakhvi

భారత్ పై దాడిలో భాగంగా ముంబాయి మారణకాండకు ముఖ్య సూత్రదారిగా భావిస్తున్న జాకిర్ ఉర్ రెహమాన్ లక్విని విడుదల చెయ్యాలంటూ ఇస్లామాబాద్ కోర్టు సంచనల తీర్పునిచ్చింది. నిర్భందంలొ ఉంచిన లక్విని వెంటనే విడుదల చెయ్యాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గత 2009 నుండి రావల్పిండి జైలులో ఉన్న లక్వీని విడుదల చెయ్యాలని గత డిసెంబర్ లో పాకిస్థాన్ ప్రయత్నించానా, భారత్ దాన్ని పూర్తిగా వ్యతిరేకించడంతో పాక్ తన ప్రయత్నాన్ని విరమించుకుంది.అయితే ముంబాయి దాడిలో నిందుతుల్లోని ఏడు గురిలో లక్వీ కీలక సూత్రధారి అని ఆరోపణలు ఉన్నాయి. కాగా లక్వీ దోషిగా నిరూపించడానికి ఎలాంటి సాక్షాధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. అయితే కోర్టు తీర్పుపై భారత్ తీవ్రంగా స్పందించింది. భారత్ తో వివిధ దేశాల్లో తీవ్రమైన రక్తపాతాన్ని సృష్టించిన ఉగ్రవాదిని విడుదల చెయ్యడం ఏంటని తీవ్రంగా వత్తిడి తీసుకు వచ్చింది.

భారత ప్రభుత్వం తరఫున లక్వీ విడుదలపై ఓ ప్రకటన కూడా విడుదలైంది. ఉగ్రవాదుల్లో మంచి ఉగ్రవాదులు అంటూ ఉండరని పేర్కొంది. పాకిస్థాన్ లక్వీ విడుదలపై నాటకాలాడుతోందని, మరోసారి తన ఉగ్రవాద పక్షపతాన్ని నిరూపిస్తోందని భారత్ మండిపడింది. దాంతో భారత్ తో పాటు వివిధ దేశాలు గొంతు కలిపాయి. అంతర్జాతీయ సమాజంలో తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలొ పాకిస్థాన్ వెనక్కి తగ్గింది. లక్వీ విడుదలను నిలిపివేస్తూ, మరో నెల పాటు జైలులో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zaki-ur-Rehman Lakhvi  26/11 attacks  mumbai  pakistan  extend  

Other Articles