Supreme court sticks to the earlier order says aadhar not mandatory

Supreme Court sticks to the earlier order, Supreme Court says Aadhar not mandatory, Aadhar matter of "serious concern", Supreme Court (SC, )Aadhar Card, Aadhaar, Gopal Subramaniam, Unique Identification Authority of India (UIDAI), central government, all state governments,

The Supreme Court on Monday asked the Centre and all the states to "adhere to" its earlier order that no person should be denied any benefits or "suffer" for not having Aadhaar cards, issued by Unique Identification Authority of India (UIDAI).

‘ఆధార్’ పడనివాళ్లపై ఒత్తిడి తీసుకురాకండీ..

Posted: 03/16/2015 09:43 PM IST
Supreme court sticks to the earlier order says aadhar not mandatory

ఆధార్ కార్డు అంశంపై గతంలో తామిచ్చిన ఆదేశాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం కట్టుబడాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోమారు కేంద్రానికి తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ కార్డులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లింకు పెట్టకూడదని గతంలో అదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు.. ఈ విషయానికి సంబంధించి.. ప్రజలపై ఒత్తిడి తీసుకురావడం మానుకోవాలని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం సుప్రీం ఆదేశించింది. సామాజిక, భద్రత పథకాలకు ఆధార్ కార్డు తప్పనసరి కాదని సుప్రీం మరోమారు సృష్టం చేసింది.
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ తో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అనుసంధానం చేసి.. ఆధార్ వుంటేనే పథకాలు వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకోవడంపై కోర్టు ఈ సూచనలు మరోమారు జారీ చేసింది. గతేడాది ఇదే తరహా ఆదేశాలను సుప్రీం ఇచ్చినా.. వాటిని ప్రభుత్వాలు పక్కకు పెట్టి ప్రతీ పథకానికి ఆధార్ ను లింక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై దాఖలైన పిటిషన్ పై సోమవారం విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు మరోమారు తాజాగా అదేశాలను జారీ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వాలకు సూచనలను జారీ చేసింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aadhar card  supreme court  central and state governments  

Other Articles