Brutal assault on young couple by 6 men in hathras

young girl thrashed by villagers, Hathras girl attacked by men, attacks on girls, couple attacked in Hathras by villagers, attack of 6 men in UP on a couple, Couple attacked by her lover in Uttar Pradesh, attacks on couple, WhatsApp video of girl thrashed, Hathras incident, shocking girl video, Goonda Act.

A college girl and her friend were beaten up by a gang of six men in Hathras in Western Uttar Pradesh.

ITEMVIDEOS: ప్రేయురాలిపై ఇలా పగను తీర్చుకున్నాడు.. ఆ శాడిస్టు..

Posted: 03/18/2015 08:33 PM IST
Brutal assault on young couple by 6 men in hathras

ప్రేమించిన వారి కోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్దంగా వుంటే నాటి తరం నుంచి ప్రేమించిన వారు ఎలాగైనా తనకు దక్కాలని సాహసాలు చేసి నిన్నటి తరం నుంచి ఏం పాఠాలు నేర్చుకున్నారో తెలియదు కానీ.. యువత పెడత్రోవ పడుతున్నారు. తాను వలచినదానిని మరోకరు చూస్తేనో, మరోకరితో వెళ్లితేనో కూడా భరించుకోలేని శాడిస్టులుగా మారుతున్నారు. అత్యంత దారుణంగా హింసిస్తున్నారు. తమకు ఇష్టం లేకున్నా.. యువకులు వెంటపడటంతో అమ్మాయిలు వారి నిర్ణయాలను కూడా చెప్పుకోలేని దౌర్భగ్య పరిస్థతిని ఎదుర్కోంటున్నారు. ఆమ్లా దాడుల నుంచి తాజాగా జరిగిన ఈ ఘటనల వరకు అన్ని నేరాలు అమ్మాయిలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానే లక్ష్యంగా చేసుకునే జరుగుతున్నాయి.

 

 

తాను ప్రేమించి అమ్మాయి మరో యువకుడితో సన్నిహితంగా తిరుగడాన్ని జీర్ణంచుకోలేకపోయిన ఓ శాడిస్టు.. తన అరుగురు మిత్రుల ముష్కర మూకను వెంటబెట్టుకుని వారిని దారిలో అడ్డుకున్నాడు. యువకుడిని దారుణంగా పచ్చి కర్రలతో చితకబాదు. ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ ప్రాంతంలోని హత్రాస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తన స్నేహితుడిని కోట్టకండని ఆ యువతి చేసిన వినతిని కూడా లక్ష్యపెట్టని ముష్కరమూక యువతిపై సైతం చేయి చేసుకున్నారు. అయితే ఈ ఘటన మొత్తాన్ని చిత్రీకరించిన ఓ యువకుడు సామాజిక వైబ్ సైట్ లో పోస్టు చేయడంతో మొత్తం యవ్వారం బట్టభయలైంది.

కాలేజీలో ఓ కార్యక్రమానికి హాజరై తన స్నేహితుడి వాహనంపై ఇంటికి చేరుకుంటున్న తమపై తమ గ్రామానికి చెందిన యువకులు దాడి చేశారని యువతి పేర్కోంది. కాలేజీ నుంచి వచ్చే దారిని అడ్డగించిన ఆరుగురు యువకులు తన స్నేహితుడిపై దాడిచేసి చితకబాదారని ఆ యువతి తెలిపింది. తన స్నేహితుడిని రక్షించేందుకు తాను వారిని ఎంత వేడుకున్నా వారు వినలేదని, పైగా తనపై కూడా చేయిచేసుకున్నారని తెలిపింది. తన ముఖానికి కట్టుకున్న స్కార్ఫ్ కూడా తొలగించిన పోకిరీలు మొత్తం ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించినట్లు తెలిపింది. మరెవరూ ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా వుండేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుందన్నారని యువతి తెలిపింది.

ఘటన సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువకులపై గూండా యాక్టు కింద కేసు నమోదు చేశారు. అరుగురు యువకులలో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : attacks on couple  WhatsApp video  Hathras incident  UP  

Other Articles