ప్రపంచ కప్ 2015 లో భాగంగా జరుగుతున్న తొలి సెమీస్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 31 పరుగులకు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. డీకాక్ 14 పరుగుల వద్ద రెండో వికెట్ గా అవుటయ్యాడు. ఆమ్లా 10 పరుగులకే ఔటయ్యాడు. దాంతో సౌతాఫ్రికా ఆశలపై నీళ్లు చల్లాడు ఆమ్లా. డీకాక్, ఆమ్లాలను ట్రెంట్ బౌల్ట్ అవుట్ చేశాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న దక్షిణాఫ్రికా ఆరంభంలో వికెట్లు కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఓపెనర్లు ఆమ్లా, డీకాక్ లకు లైఫ్ ఇచ్చారు. 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డీకాక్ ఇచ్చిన క్యాచ్ ను కీపర్ రోచి పట్టలేకపోయాడు. సౌతీ బౌలింగ్ లో ఆమ్లా ఇచ్చిన క్యాచ్ పట్టేందుకు బౌల్ట్ అందుకోలేకపోయాడు. అయితే తనకు లభించిన లైఫ్ ను ఆమ్లా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. జట్టు స్కోరు 21 పరుగుల వద్ద ఆమ్లా 10 పరుగుల వద్ద ట్రెంట్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.14 బాల్స్ లో రెండు ఫోర్లతో 10 పరుగులు చేసిన ఆమ్లా మొదటి వికెట్ ను సమర్పించి న్యూజిలాండ్ కు మంచి కిక్కునిచ్చాడు. డీకాక్ 17 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన ప్లీసిస్ 67 బంతుల్లో 4 ఫోర్లు బాది 41 పరుగులతో, రోసో 44 బంతుల్లో 2 ఫోర్లు బాది 38 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతానికి 25.4 ఓవర్లలతో సౌతాఫ్రికా 111 పరుగులు చేసింది.
ముందు నుండి మాట్ వేఫరేట్ గా ఉన్న సౌతాప్రికా జట్టును న్యూజిలాండ్ ఆటగాళ్లు చెమటలు పట్టిస్తున్నారు. కట్టుదిట్టమైన ఫీల్డిండ్ తో పరుగుల సంగతి పక్కన ఉంచితే కనీసం క్రీజ్ లో కాసేపు నిలదొక్కుకోవడానికే సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్లు ఆపసోపాలు పడుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సెమీస్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ ప్లాన్ వర్కౌట్ అయింది. సఫారీ బ్యాట్స్ మెన్లను ఒత్తిడిలోకి నెట్టడంలో న్యూజిలాండ్ టీం విజయం సాధించింది. దీంతో స్వల్ప స్కోరుకే సౌతాఫ్రికా ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ట్రెంట్ బౌలింగ్ లో నలుగురు ఫీల్డర్లను స్లిప్ లో మొహరించాడు. మరొకరిని గల్లీలో పెట్టి బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి పెంచాడు. ఈ వ్యూహం ఫలించింది. ఓపెనర్లు ఇద్దరినీ బౌల్ట్ పెవిలియన్ కు పంపాడు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more