Photos of grand son of chandrababu and balakrishna

photos of grand son of chandrababu and balakrishna . in the net the photos of photos of grand son of chandrababu and balakrishna very popular. the nara, nandamuri families got special gift on the occasion of ugadi. cinema hero, hindupur mla balakrishna, ap cm chandrababu naidu become grand parents. nara lokesh wife bhahmani gave birth to boy baby on ugadi

photos of grand son of chandrababu and balakrishna

నెట్ లొ హల్ చల్ చేస్తున్న నారా, నందమూరి వారసుడి ఫోటోలు

Posted: 03/24/2015 10:23 AM IST
Photos of grand son of chandrababu and balakrishna

ఉగాది పండగ అందరికి సంతోషాలు తీసుకువస్తుంది. అయితే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సినీ హీరో బాలకృష్ణకు మాత్రం డబుల్ ధమాకాను తీసుకువచ్చింది ఈ ఉగాది. ఒకేసారి నందమూరి, నారా కుటుంబాల్లో సంతోషాలను తీసుకువచ్చింది ఈ ఉగాది. చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి మగబిడ్డకు జన్మనిచ్చింది. శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది పర్వదినాన ఇటు నారా వారు, అటు నందమూరి వారింట ఆనందం వెల్లివిరిసింది. ఉగాది రోజునే టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాతయ్యలు అయ్యారు.

అయితే తాజాగా నారా, నందమూరి వారసుడి ఫోటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. తండ్రి లోకేష్ చిన్నారిని ఎంతో ఆప్యాయంగా ఎత్తుకుని ఉన్న ఫోటోతో పాటు, కేవలం చిన్నారి మాత్రమే ఉన్న ఫోటోలు నెట్ లో తెగ ప్రచారంలో ఉన్నాయి. దాంతో నందమూరి, నారా అభిమానులు చిన్నారిని చూడడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. నారా వారి బుల్లి వారసుడు ఎంతో అందంగా ఉన్నాడని అప్పుడే ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి  తల్లి బిడ్డ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఉగాది పండుగ నారా, నందమూరి వారింట కొత్త ఫ్యామిలీ మెంబర్ ను గిఫ్ట్ గా ఇవ్వడం ఎంతో సంతోషమే కదా. మరీ మీ ఆ బుల్లోడిని చూడండి...

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : photos  ugadi  nandamuri  nara  chandrababu  chandrababu  nara lokesh  brahmani  

Other Articles