tdp leader, ys jaganmohanreddy, pulivendula, cudappa

Tdp leaders commence to rally for opposing ys jaganmohan reddy in pulivendula

ys jagan, ysrcp, sathish reddy, mlc, rally, media, ys jaganmohanreddy, pulivendula, cudappa

tdp leaders commence to rally for opposing ys jaganmohan reddy in pulivendula. tdp leader, legislative council vice president sathish reddy organised a rally which is oppose to the ysrcp leader ys jagan. media focus on this issue, and ys jagan not consuntrate on the ap but fail to consuntrate on his own constitution.

జగన్ కు వ్యతిరేకంగా ర్యాలీ.. అదీ పులివెందులలో

Posted: 03/24/2015 01:01 PM IST
Tdp leaders commence to rally for opposing ys jaganmohan reddy in pulivendula

వైయస్ కుటుంబానికి కంచుకోట అనే కన్నా ఇంకాస్త ఎక్కువే అయిన పులివెందులలో జగన్ కు వ్యతిరేక పవనాలు మామూలుగా కాదు కాస్త గట్టిగానే వీస్తున్నాయి. ఏపి అసెంబ్లీ లో రెచ్చిపోయి ప్రభుత్వానికి వ్య తిరేకంగా మాట్లాడుతున్న జగన్ తన స్వంత నియోజక వర్గంలో వస్తున్న వ్యతిరేకత ను మాత్రం గమనించలేకపోతున్నారు. గతంలోనూ ఎన్నకల్లో ఎవరూ ఊహించని విధంగా టిడిపి తరఫున వైయస్ కుటుంబానికి వ్యతిరేకంగా నామినేషన్ వేసి ఏకంగా ప్రచారం కూడా చేశారు. అయితే పులివెందులలో ఎన్నడూ వ్యతిరేకత లేదు అనుకునే వారు తాజాగా జరిగిన ఓ ఘటనతో ఖంగుతిన్నారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినిల్లు పులివెందులలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అయితే పవనాలు నిన్నటి దాకా కొన్ని కారణాలతో కనిపించకుండా పోయినా, ఇప్పుడు మాత్రం బాహాటంగా బయటపడుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడి పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చెయ్యాలని చూస్తుంటే జగన్ దానికి అడ్డుతగులుతున్నారని జగన్ వ్యతిరేక వర్గం మండిపడుతోంది. చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడి పట్టిసీమను ప్రారంభించారని, కరువు జిల్లాలకు నీటిని అందించే గొప్ప ప్రాజెక్టును వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపిస్తు టిడిపి నేతలు పులివెందులలో ర్యాలీ నిర్వహించారు. శాసనమండలి ఉపాధ్యక్షుడు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్ వ్యతిరేక ర్యాలీ జరిగింది. పట్టిసీమను పూర్తి చేసి సీమ జిల్లాలకు నీటిని అందించడం ద్వారా కరువు జిల్లాలను సస్యశామలం చెయ్యాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారని సతీష్ రెడ్డి వెల్లడించారు. కానీ జగన్ మాత్రం కరువు జిల్లాలను ఎప్పటికి నీరు అందకుండా చెయ్యాలనే తపన పడుతున్నారని ఆరోపించారు. మొత్తానికి జగన్ కు వ్యతిరేకంగా ఆయన ఇలాఖాలోనే ర్యాలీ నిర్వహించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : ys jagan  ysrcp  sathish reddy  mlc  rally  media  ys jaganmohanreddy  pulivendula  

Other Articles