jagan | speaker | assemlby

Ysrcongress leader ys jagan on speaker

ys jagan, jagan, ap, assembly, speaker, apcapital, landpooling

ysrcongress leader ys jagan on speaker. ys jagan mohan reddy in the ap assembly on speaker. jagan said that the resoution on the dicussion about the land pooling and capital of ap.

అబ్బా.. జగన్ బాబు ఎంత బాగా చెప్పాడో..

Posted: 03/25/2015 02:55 PM IST
Ysrcongress leader ys jagan on speaker

అదేదో తెలుగు సినిమాలో డైలాగ్ గుర్తుకు వచ్చిందా.. అయినా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటు చేసుకున్న ఘటనపై ఇంత కన్నా మంచిగా రాయడానికి వీలు కాలేదు. ఏపి అసెంబ్లీలో నిన్నటి దాకా ప్రతి విషయానికి పేచి పెట్టిన నేత, ఒక్కసారిగా శాంతమూర్తిలాగా చిలుక పలుకులు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై చర్చను స్పీకర్ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పి అందరికి ఆశ్చర్యాన్ని కలిగించారు. భూసేకరణ,  రాజధాని పై చర్చకు అనుమతించాలని జగన్ కోరగా,  స్పీకర్ నిరాకరించారు.  కాగా  అంతకు ముందు రాజధాని ప్రాంతంలో బలవంతపు భూ సమీకరణ అంశంపై శాసనసభ దద్దరిల్లింది.

తమ నేత మాటలతో వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు సైతం కాస్త అయోమయానికి గురయ్యారు. నిన్నటి దాకా ప్రతి విషయానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపైకి ఒంటి కాలుతో లేచి కూర్చున్న జగన్ ఒక్క సారిగా స్పీకర్ గురించి నెమ్మదించి మాట్లాడారు. స్వంత పార్టీ నేత రోజా ఏకంగా స్పీకర్ ఓ ఫ్యాక్షనిస్టు అని వ్యాఖ్యానించింది. ఇలా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్ పై కారాలు మిరియాలు నూరుతుంటే, జగన్ మాత్రం తీరిగ్గా స్పీకర్ విజ్ఞతకే వదిలేస్తున్నా అని చెప్పడం అందరినీ ఆకట్టుకుంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ys jagan  jagan  ap  assembly  speaker  apcapital  landpooling  

Other Articles