తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బతగిలింది. ఎన్నికల ఫలితాలతో కారు తిరగడింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్ధి దేవీప్రసాద్ ఓటమిపాలయ్యారు. మొదటి ప్రాధాన్య ఓటుతోనే బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గెలుపొందారు. 13,318 ఓట్ల ఆధిక్యతతో ఎన్నికల్లో విజయభేరి మోగించారు. మొత్తం 1,11,739 ఓట్లు పోల్ కాగా రామచంద్రరావుకు 53,881 ఓట్లు, దేవీప్రసాద్‌కు 40,563 ఓట్లు లభించాయి. లెక్కింపు పూర్తయి ఫలితం తెలిసినప్పటికీ ఎన్నికల కమిషన్ అనుమతితో వివరాలను గురువారం ప్రకటించనున్నారు. కాగా, వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజక వర్గంలో ఓట్ల లెక్కింపు నెమ్మదిగా సాగడంతో గురువారం మధ్యాహ్నానికి తుది ఫలితం వస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం కోసం టీఆర్ఎస్ తీవ్రంగా శ్రమించింది. మంత్రులు హరీశ్‌రావు, కె.తారకరామారావులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో మంత్రులు పూర్తిగా ప్రచారంపైనే దృష్టి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గంలో ఏకంగా డిప్యూటీ సీఎం సహా ఐదుగురు మంత్రులు విస్తృత ప్రచారం చేశారు. ఇంత చేసినా ఫలితం ప్రతికూలంగా రావడంపై టీఆర్ఎస్ వర్గాలు అంతర్మథనంలో పడ్డాయి.
ఇది ప్రభుత్వ వ్యతిరేక తీర్పు. మూడు జిల్లాల్లోని పట్టభద్రులు, విద్యావంతులు, ఓయూ విద్యార్థుల పాత్ర ఉందని బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచంద్రరావు వెల్లడించారు. టీడీపీ, లోక్‌సత్తా, కొన్ని సంస్థలు, విద్యార్థి సంఘాలు తన గెలుపు ఎంతో కోసం కృషి చేశాయని తెలిపారు. గెలుపు కోసం అధికార పార్టీ డబ్బులు వెదజల్లిందని. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లను బెదిరించిందని అన్నారు. ఇది ప్రభుత్వ వ్యతిరేక తీర్పు కాదని, నామినేషన్ ఆలస్యం కావడంతో ఓటర్లకు చేరువ కాలేకపోయామని టిఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ అన్నారు. రామచంద్రరావు రెండు సార్లు మండలి, ఒకసారి ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి ఓడిపోయారని, దీని వల్ల ఓటర్లను ఎక్కువసార్లు కలుసుకున్న నేత గా ఆయనకు అధిక ఓట్లు వచ్చాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీలు ఒక్కటై టీఆర్ఎస్ను ఓడించాయని వెల్లడించారు. మొత్తానికి తెలంగాణలో తిరుగులేని పార్టీగా ఎదిగిన టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలు గట్టి గుణపాఠాన్ని తెలిపాయి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more