ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంటులో భాగంగా సిడ్నీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో అతిధ్య జట్టు అస్ట్రేలియా భారత బౌలర్లపై ముచ్చమటలు పట్టిస్తున్నారు. మూడో ఓవర్లో లభించిన వార్నర్ వికెట్ తప్ప 20 ఓవర్లు దాటినా మరో వికెట్ ను చేజిక్కించుకోలేక పోయారు. దీంతో స్మిత్, ఫించ్ మధ్య సుమారుగా 100 పరుగులకు చేరుకుంది. అటు మరో వైపు ఫించ్ కూడా హాఫ్ సెంచరీకి చేరువలో వున్నాడు. ధీటైన బ్యాలింగ్ లైన్ అప్ వున్న అసీస్.. మరోవైపు రన్ రేట్ ను కూడా క్రమంగా 5.5 నుంచి ఆపైనే నమోదు చేసుకుంటూ పరుగులు సాధిస్తున్నారు. ఇప్పటికే స్మీత్ అర్థ సెంచరీని పూర్తి చేయగా, అటు ఫించ్ కూడా చేరువలో వున్నాడు, 10 ఓవర్ లో అసీస్ బ్యాట్స్ మెన్ స్మిత్ ఒకే ఓవర్ లో నాలుగు ఫోర్లు బాది పదహారు పరుగులను రాబట్టారు. దీంతో 14 ఓవర్ నుంచే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోణి స్పిన్నర్ లను రంగంలోకి దింపాడు. స్మిత్ ఆరు ఫోర్ల, ఒక సిక్స్ సాయంతో 62 బంతులను ఎదుర్కోని 66 పరుగులు సాధించగా, ఫించ్ 80 బంతులను ఎదుర్కోని నాలుగు ఫోర్ సాయంతో 47 పరుగులు సాధించాడు.
అంతకుముందు మూడో ఓవర్ లో ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో మిడిల్ స్టంప్ మీద సంధించిన రైసింగ్ డెలివరీని వార్నర్ లెగ్‌సైడ్ ఆడటానికి ప్రయత్నించగా బ్యాట్ ఎడ్జ్‌కి తాకి ఆఫ్ సైడ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లి చేతుల్లోకి సులభమైన క్యాచ్ రూపంలో వెళ్లింది. దీంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. యాదవ్ మొదటి ఓవర్‌లో ఒక సిక్స్, ఒక బౌండరీ ఇచ్చాడు. రెండో ఓవర్‌లో మొదటి బంతికే వికెట్ తీయటంతో భారత్ వూపిరి పీల్చుకుంది. వికెట్ల వద్ద కుదురుకుంటే విధ్వంసం సృష్టించే వార్నర్ ఔట్ కావటం భారత్‌కు శుభపరిణామం. ప్రపంచకప్‌లో వార్నర్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. వార్నర్ స్థానంలో ఫామ్‌లో ఉన్న స్మిత్ బ్యాటింగ్‌కు ధాటగానే అడుతున్నాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more