నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం రైతుల నుండి సేకరిస్తున్న భూముల విషయంలో హైకోర్ట్ కీలక తీర్పును వెలువరించింది. రైతులకు ఊరట కలిగించేలా ఉమ్మడి హైకోర్ట్ తీర్పును వెలువరించింది. రాజధాని పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ను వ్యతిరేకిస్తున్న రైతులకు హైకోర్ట్ ఊరటనిచ్చింది. ల్యాండ్ ఫూలింగ్ నుంచి తమను విముక్తి చేయాలంటూ ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాలకు చెందిన 32మంది రైతులు కోర్టులో పిటిషన్ వేశారు. తమ అంగీకరాపత్రాలను తిరిగి వెనక్కి తీసుకుంటామని వేసిన రైతులు గతంలో హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. రైతుల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. 15 రోజుల్లోగా ఆ దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రభుత్వం హైకోర్ట్ కు రిపోర్ట్ చేసింది. .
ఏపి రాజధాని నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అక్కడి సర్కార్ కు ఇది కాస్త ఇబ్బంది కలిగించే వార్తే. అయితే రాజధాని కోసం 90 శాతం రైతులు స్వతహాగా ముందుకు వచ్చారని ప్రభుత్కవం ముందు నుండి వాదిస్తోంది. కొంత మంది మాత్రం తమ భూములను ఇవ్వడానికి సిద్దంగా లేరని, కానీ వారు కూడా భూములను ఇచ్చేందుకు వ్యతిరేకం కాదని ప్రభుత్వం తెలిపింది. అయితే అంగీకార పత్రాలను వెనక్కి తీసుకుంటామన్న రైతుల దరఖాస్తులపై కోర్టుకు త్వరలోనే నివేదిక సమర్పిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. బలవంతపు భూ సమీకరణ వ్యతిరేకిస్తున్న రైతులందరి సమిష్టి విజయం అని, రైతుల తరఫున వాదించిన న్యాయవాది పి.సుధాకర్ రెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో అంగీకార పత్రాలను నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చని ఆయన తెలిపారు. మరి వరల్డ్ క్లాస్ కేపిటెల్ సిటిని నిర్మించాలని అనుకుంటూ, ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్న చంద్రబాబు సర్కార్ ఇక ముందు ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. హైకోర్ట్ తీర్పుపై సిఎం చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more