ఎవరి పీకలపైనైనా కత్తి పెట్టి బెదిరింపులకు పాల్పడితే. అదీ దారి దోపిడి ముఠా చేతిలో మారణాయుధాలతో ఇలా చేస్తే.. భయటపడగానే ప్రాణం దక్కింది అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా.. మంచి కథ దోరికిందని గంతులేశాడు ప్రముఖ సినిమా రచయిత కోన వెంకట్. అదేంటి సినీ రచయితను దారి దోపిడి ముఠా బెదిరించడమేమిటీ.. ఇది కూడా ఏదో సినిమా కథేగా అనుకుంటున్నారా..? కాదండి. ఇది యదార్థ ఘటన, స్వానుభవంతో వచ్చిన అలోచన. తమకు ఎదురైన విపత్కర పరిస్థితులను సినిమాగా తీయాలనే నిరీక్షణ. ఏమిటీ.. కోన వెంకట్ సహా దానయ్యలను దారి దోపిడీ ముఠా అడ్డుకోవడమేమిటి..? అది సినిమాగా తీయడమేమిటీ అని క్వశ్చన్ మార్క్ పెట్టకండి. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇలా వున్నాయి.
ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న రచయిత కోన వెంకట్, నిర్మాత దానయ్యలు మహాబూబ్ నగర్ జిల్లా లోని షాద్ నగర్ లో గల ఆయన ఫాం హౌజ్ లో జరిగిన వేడుకలకు హాజరయ్యారు. అర్థరాత్రి వరకు వేడుకలు జరగుగా, రాత్రి రెండు, రెండున్నర గంటల సమయంలో వారు అక్కడి నుంచి నగరానికి బయలు దేరి వస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ వద్ద సరిగ్గా సినిమా ఫక్కిలో వాళ్లను దారి దోపిడి ముఠా అడ్డగించింది. రోడ్డుపై చెట్టును అడ్డంగా పడేసి తప్పించుకుని వెళ్లే వీలు లేకుండా అపింది. దీంతో చేసేది లేక దోపిడి ముఠాకు చిక్కిన వెంకట్, దానయ్యలను వారు నిలువు దోపిడి చేశారు. మెడపై కత్తి పెట్టి మరీ వంటి మీదనున్న బంగారు అభరణాలు. డబ్బు సహా ఇతర విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. చోరీ జరిగింది. మొత్తం సుమారుగా మూడు లక్షల రూపాయల పైచిలుకు వారికి సమర్పించినట్లు సమాచారం.
అయితే వీరి వెనుకనే నగరానికి వస్తున్న శ్రీనువైట్ల, థమన్, గోపీ మోహన్.... దోపిడీ వ్యవహారాన్ని గమనించి తమ వాహనాలను వెనక్కి తిప్పి వెళ్లిపోయారు. వారు పోలీసులకు అందించిన సమాచారంతో హుటాహుటిన పోలీసులు ఘటనాస్థాలనికి చేరుకున్నారు. అయితే అప్పటికే దోపిడి ముఠా పలాయనం చిత్తగించింది. ఈ ఘటనపై కోన వెంకట్ మాట్లాడుతూ తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని, దుండగుల దాడి నుంచి ప్రాణాలతో బయటపడినందుకు హ్యాపీగా ఉందన్నారు. కాగా.. డబ్బు పోతే పోయింది కానీ, తన తదుపరి చిత్రానికి మంచి కథ దొరికిందని కోన వెంకట్ వ్యాఖ్యానించటం కొసమెరుపు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more