cm kcr | farmer jella rajunarsu suicide | telangana farmers

Farmer jella rajunarsu suicide in cm kcr hometown

farmer jella rajunarsu, farmer jella rajunarsu suicide, cm kcr news, telangana farmer suicides, telangana farmers news, telangana state news, telangana power problems, cm kcr updates, cm kcr news, cm kcr gallery

farmer jella rajunarsu suicide in cm kcr hometown : A telangana farmer named jella rajunarsu suicide in his hometown which is also ck kcr hometown which is going viral in political way.

ఇంకెన్నాళ్లీ ఘోరం.. కేసీఆర్ సొంతూరులోనే రైతు బలవన్మరణం

Posted: 03/30/2015 10:31 AM IST
Farmer jella rajunarsu suicide in cm kcr hometown

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే వుంది. ప్రభుత్వ అలసత్వ ధోరణి వల్లో లేదా ప్రకృతి ప్రకోపమో తెలియడం లేదు కానీ.. భూమిని నమ్ముకున్న రైతులు బలవన్మరణం పాలవుతున్న ఘటనలు రాష్ట్రంలో పెరుగుతూనే వున్నాయి. ఇప్పటికే వేలాది రైతులు మరణించగా.. తాజాగా తాజాగా సీఎం కేసీఆర్ సొంతూరులోనే ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.

కేసీఆర్ సొంత గ్రామం చింతమడకు చెందిన రైతు జెల్ల రాజనర్సు దగ్గర నాలుగెకరాల పొలం వుంది. ఈ పొలం సాగుకోసం అతను అందినమేరకు అప్పులు చేసుకుంటూ వచ్చాడు. నాలుగేళ్లలో ఏడు బోర్లు కూడా వేయించాడు కానీ.. చుక్క నీరు కూడా పడలేదు. అయినా సాగుపై ఆశచావని అతడు.. ఈనెల 28న మరో బోరు వేయించాడు. అయితే అందులో కూడా నీరు పడలేదు. ఇక ఈ ఏడాది వేసిన పంట ఇంతవరకు చేతికందలేదు. మొత్తానికి బోర్లు, పంట సాగుకోసం అతడు చేసిన అప్పులు రూ.6 లక్షలకు చేరుకున్నాయి. పంట చేతికందుతున్న నమ్మకంతో నాలుగేళ్ల నుంచి అప్పులు చేసుకుంటూ పోయాడు కానీ.. ఫలితం మాత్రం దక్కలేదు.

దీంతో అతను చేసిన ఆ అప్పును ఎలా తీర్చాలోనన్న పరిష్కారం లభించక చివరికి అతడు గ్రామం శివారులో పరుగులమందు తాగి తనువు చాలించాడు. కేసీఆర్ సొంతూరులోనే ఓ రైతు ఇలా ఆత్మహత్య చేసుకోవడంపై ఎన్నో విమర్శలు లేవనెత్తుతున్నాయి. మరి దీనిపై కేసీఆర్ ఏ విధంగా సమాధానమిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : farmer jella rajunarsu  cm kcr  telangana problems  

Other Articles