swiss banks rules | indian central government | swiss Black billionaires

Swiss banks asking assurance from indian account holders

swiss banks, swiss bank black money, indian account holders swiss bank, central government, swiss banks assurance, Black money billionaires, Black billionaires, swiss bank Black billionaires

swiss banks asking assurance from indian Account holders : The Swiss banks asking assurance from indian Account holders that they hidden their money in banks is not tax evasion

అది ‘నల్లధనం’ కాదని హామీ ఇవ్వగలరా..?

Posted: 03/30/2015 10:49 AM IST
Swiss banks asking assurance from indian account holders

నల్లకుబేరుల విషయంపై కేంద్రప్రభుత్వం ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో స్విస్ బ్యాంకులు తమ నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ బ్యాంకులు భారత్ కు చెందిన ఖాతాదారులందరినీ చుక్కలు చూపిస్తున్నాయని తెలుస్తోంది. లెక్కల్లో చూపని డబ్బును దాచుకునేందుకు స్విస్ బ్యాంకులు సురక్షితంగా వుంటూ వస్తున్న విషయం తెలిసిందే! కానీ.. తమ మీద పడిన ఈ ముద్రను చెరిపేసేందుకు ఆ బ్యాంకులు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోందని సమాచారం!

తమ బ్యాంకుల్లో దాచిన సొమ్ము పన్ను ఎగవేత ద్వారా వచ్చింది కాదనే హామీ పత్రాలను ఎట్టిపరిస్థితుల్లోనైనా ఇవ్వాల్సిందిగా స్విస్ బ్యాంకులు ఇండియాకు చెందిన ఖాతాదారులకు సూచించాయి. అంటే.. ‘ఇప్పటివరకు బ్యాంకుల్లో దాచిన సొమ్ము నల్లధనం కాదని నిరూపించగలరా..?’ అని స్విస్ బ్యాంకులు ప్రశ్నిస్తున్నాయి. దీంతోపాటు భారీ ఆదాయం వున్న వ్యక్తుల నుంచి ఆడిటర్ ధ్రువపత్రాలనూ అడిగి తీసుకుంటున్నాయని తెలిసింది. వ్యక్తులైనా, సంస్థలైనా తాము దాచుకున్న డబ్బుపై ఆడిటర్ ధ్రువపత్రాలనూ సమర్పించాల్సి వుంటుందని బ్యాంకులు పేర్కొన్నాయి. దీంతో నల్లకుబేరులు మరింత ఆందోళనల్లో మునిగిపోయారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : swiss banks rules  indian central government  swiss Black billionaires  

Other Articles