Ap | Salary | Overdraft

Ap govt didnt have fund to pay salarys to emplooyes

ap, financial year, salary, empolyees, over draft, rbi, chandrababu, yanamala

ap govt didnt have fund to pay salarys to emplooyes. andhrapradesh govt facing financial problems. the end of this financial year, ap govt didnt have the mandetary funds.

ఏపి ఉద్యోగులకు జీతాలు కష్టమే..?

Posted: 03/31/2015 09:14 AM IST
Ap govt didnt have fund to pay salarys to emplooyes

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దిగజారుతూ వస్తోంది. ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు కూడా కష్టంగా మారింది. తాత్కాలిక చెల్లింపుల కింద 1,150 కోట్ల రూపాయలు దాటి  ఓవర్ డ్రాఫ్ట్ ఏకంగా 5 వేల కోట్లకు చేరుకుంది. ఏపి ఓవర్ డ్రాఫ్ట్ గురించి ఆర్బీఐ గతంలోనే హెచ్చరించింది. కనుక కేంద్రం నుంచి నిధులు ఏవి వచ్చినా ఓవర్ డ్రాఫ్ట్ తీర్చడానికే వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓవర్‌డ్రాప్ట్‌ సొమ్ము పది దినాల్లో తిరిగి చెల్లించకపోతే ఆర్‌బీఐ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలన్నింటినీ నిలిపివేస్తుంది. ఒకవేళ అలా జరిగితే రాష్ట్ర ఆర్థిక ప్రతిష్ట మరింత మసకబారుతుంది. ఎక్కడూ అప్పు పుట్టని పరిస్థితి నెలకొంటుందని అధికారవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కేంద్రప్రభుత్వం నుంచి 1,065 కోట్లు  రాష్ట్ర ఖజానాకు జమయ్యాయి. ఇందులో 13వ ఆర్థిక సంఘానికి చెందిన నిధులు 516 కోట్లు, జాతీయ చిన్న మొత్తాల కింద 549 కోట్లు ఉన్నాయి. అయితే ముందు ఓవర్ డ్రాఫ్ట్ వ్యవహారం తేలాకే జీతాల విషయం చూద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ 1వ తేదీన వేతనాలు ఇస్తారా, లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.

అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలకు, పెన్షన్ చెల్లింపులకే నెలకు 2,500 కోట్లకు పైగా వ్యయం ఉంటుంది. కాగా ఈ రోజుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది కాబట్టి కేంద్రం నుంచి అదనంగా ఎన్ని నిధులు వస్తాయో స్పష్టత వస్తుంది. కనుక అప్పుడు వేతనాల చెల్లింపుపై నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని స్వయంగా ఆర్థిక మంత్రి  చెప్పారు. ఐదు వేల కోట్లకు పైగా అదనపు నిధులు కావాల్సి ఉందని ఆయన వివరించారు. మరి ఏపి సర్కార్ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. ముందు ఓవర్ డ్రాఫ్ట్ ను చెల్లించాలని భావిస్తోంది. కానీ ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలు ఇవాళ సమకూర్చకపోతే, ఈ నెల ఉద్యోగుల జీతాలు కాస్త ఆలస్యం కావచ్చు. అయితే ఒకవేళ ఎలాంటి ప్రత్యామ్నాయం దొరకకపోతే ఏపి ప్రభుత్వం ఎలాంటి చర్యలకు దిగుతుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : ap  financial year  salary  empolyees  over draft  rbi  chandrababu  yanamala  

Other Articles