కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై బీజేపీ నేత, కేంద్ర చిన్న, మధ్య తరహా ప్రభుత్వ రంగ సంస్థల శాఖ సహాయ మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యాలపై కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేంద్ర మంత్రిగా కోనసాగుతూ.. సభ్య సమాజం తలదించుకునేలా ఆయన వర్ణ వివక్షకు తెరలేపడాన్ని అందునా.. ప్రతిపక్ష పార్టీ అధినేత్రిపై ఇలాంటి వ్యాఖ్యాలు చేయడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ నేతలు తూర్పారబట్టారు. గిరిరాజ్ సింగ్ ను తక్షణమే కేంద్ర మంత్రి పదవి నుంచి తోలగించాలని డిమాండ్ చేశారు.
గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యాలు అఃతని మూర్ఖత్వానకి పరాకాష్టగా మరికోందరు కాంగ్రెస్ నేతలు అభివర్ణించారు. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యల పైన ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మరోవైపు, గిరిరాజ్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని బీజేపీ దూరం జరిగే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ మాట్లాడుతూ.. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యల పైన ప్రధాని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇవి ఖండించదగ్గవన్నారు. గిరిరాజ్ సింగ్ కేంద్రమంత్రిగా ఉండి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, దీనిపై ఆయన ప్రధాని తప్పనిసరిగా స్పందించాలన్నారు.
అటు రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ అద్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంతలో వుండాల్సిన నాయకులు అంతలోనే వుండాలని, అమర్యాదగా వ్యవహరించడం, అవతలి వ్యక్తులపై చౌకబారు విమర్శలను చేయడం సమంజసం కాదన్నారు. గిరిరాజ్ వ్యాఖ్యలు అర్థరహితమని మండిపడ్డారు. అన్ని రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో గిరిరాజ్ సింగ్ కూడా తన వ్యాఖ్యలపై వెనక్కు తగ్గారు. తన వ్యాఖ్యలు సోనియా, రాహుల్ ను బాధపెట్టివుంటే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు.
అలా అంటూనే తన వాఖ్యాలను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. సోనియా గాంధీని కాకుండా రాజీవ్ గాంధీ నైజీరియా మహిళను వివాహం చేసుకునివుంటే.. నలుపు రంగు మహిళ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అంగీకరించేదా? అని గిరిరాజ్ సింగ్ అన్నారు. అయితే తాను ఆఫ్ ద రికార్డ్ గా అన్నమాటలపై వివాదం చేయడం తగదని ఆయన అన్నారు. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలు దురదృష్టకరమని నైజీరియా రాయబారి పేర్కొన్నారు. అటు బీజేపి కూడా మంత్రి వ్యాఖ్యాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అభివృద్ది
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more