Soniagandhi | Congress | President

Sonia gandhi will complete 17 years as congress president

sonia gandhi, aicc, president, congress, indira gandhi, congress party

Sonia Gandhi will complete 17 years as Congress president , a landmark that assumes importance as it follows the party's decimation in Lok Sabha polls — a stark reminder of the day she assumed political office amid a complete collapse in 1998.

భారత రాజకీయాల్లో సోనియాగాంధీ మరో ప్రస్థానం

Posted: 04/02/2015 12:33 PM IST
Sonia gandhi will complete 17 years as congress president

సోనియా గాంధీ అంటేనే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే సోనియాగాంధీ అనేంతగా ఎదిగిపోయారు సోనియా గాంధీ. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో, కొత్త పరవళ్లు తొక్కించడానికి సోనియా గాంధీ చేసిన కృషిని ఎవరూ మరిచిపోలేరు. 17 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఆమె సాధించిన పట్టు అది. రాజకీయ వ్యూహ రచనలో అత్త ఇందిరాగాంధీని మించి పోయారు సోనియా గాంధీ.  దేశ రాజకీయాలపై చెరగని ముద్రను వేస్తూ, అధ్యక్షురాలిగా  పార్టీని నడిపిస్తున్న సోనియా గాంధీ ఏఐసిసి అధ్యక్షురాలిగా 17 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.

సోనియా 17ఏళ్లుగా పార్టీ పగ్గాలను తన ఆధీనంలో ఉంచుకున్నారు. నెహ్రూ కుటుంబం తప్ప కాంగ్రెస్ కి మరో దిక్కులేదని దశాబ్దాలుగా సాగుతున్న ప్రచారానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలబడ్డారు. ఎక్కడో ఇటలీలో పుట్టి... భారత రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఎదిగారు సోనియాగాంధీ. ఆమె హయాంలోనే పార్టీ అధికారాన్ని అనుభవించింది.. ఆమె హయాంలోనే పార్టీ అధ: పాతాళానికి దిగజారింది. సోనియా భారత రాజకీయాల్లో ఎప్పుడూ సంచలనమే. ఎక్కడో ఇటలీలొ సాధారణ కుటంుబంలో పుట్టిన సోనియా భారత దేశ భవిష్యత్తుని నిర్ణయించే స్థానానికి ఎదగటం యాధృచ్చికం కాకపోవచ్చు. కానీ, ఆమె రాజకీయ ప్రస్థానం ఎన్నో వింతలు విషాదాల సమాహారం అనే చెప్పాలి. ఏమైనా కాంగ్రెస్ లో నెహ్రూ ఫ్యామిలీ వారసత్వాన్ని నిరాటంకంగా కొనసాగించిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుంది.

ఇందిరా గాంధీ ఏడేళ్లే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగింది. కానీ సోనియా పదిహేడేళ్లు నిరాటంకంగా పదవిలో కొనసాగుతున్నారు. మొదట్లో ఇందిర చతురత ముందు, రాజకీయ పరిణతి ముందు సోనియా ఎంత అనుకున్నారు. కానీ, రాను రాను సోనియా రాటుదేలారు. బూర్జువా రాజకీయాల నిర్వహణలో తనదైన శైలిని నిర్మించుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు కూడా నిరంతరం సోనియా భజన లోనే మునిగిపోతున్నాయి. గాంధీ కుటుంబం అండ లేకపోతే, పార్టీ మనుగడ అసాధ్యమనే ధోరణిలో నడుచుకుంటున్నారు.. సోనియా చెప్పిందే వేదమంటున్నారు. అధినేత్రిని ధిక్కరిస్తే భవిష్యత్తు లేదని భావిస్తున్నారు.

ఏఐసీసీ అధ్యక్షురాలిగా 17 ఏళ్లు పూర్తి చేసుకున్న సోనియా గాంధీ ఆ పదవిని సుదీర్ఘ కాలంగా నిర్వహిస్తున్న నేతగా రికార్డు సష్టించారు.  1997లో కోల్కతాలో జరిగిన పార్టీ ప్లీనరీలో ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు. ప్రాథమిక సభ్యత్వం తీసుకొన్న 62 రోజులకే 1998లో ఆమె పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలను స్వీకరించారు. అప్పటి నుంచి ఆమె పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తూ రికార్డు నెలకొల్పారు. కాంగ్రెస్ చరిత్రలో ఇంతకాలం ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవరూ నిర్వహించలేదు.  1999లో కర్నాటకలోని బళ్ళారి నుంచి, ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నుంచి ఆమె లోక్ సభకు పోటీ చేశారు. బళ్ళారిలో సీనియర్ బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్‌ను ఓడించారు. అదే సంవత్సరం  ఆమె 13వ లోక్ భకు ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. 2004, 2009,2014 సంవత్సరాలలో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని రాయ్బరేలీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. మొత్తానికి దేశ రాజకీయ ముఖచిత్రంలో ఎంతో కీర్తి సంపాదించిన సోనియాగాంధీ మరెన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : soniagandhi  sonia  aicc  president  congress  indira  

Other Articles