కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్ పై సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతోంది. సోనియాగాంధీ ఒక్కరినే కాకుండా రాహుల్ ను కూడా అతను విమర్శించడంతో కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. గిరిరాజ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. అయితే సోనియా గాంధీ పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్ ను ఏకంగా రేపిస్టులతో పోల్చి మరీ తిడుతున్నారు ఇండియన్ డాటర్ డాక్యుమెంటరీ దర్శకురాలు లెస్తీ ఉడ్విన్.
ప్రజా ప్రతినిధులై ఉండి స్త్రీలను అవమానించేలా, కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ రేపిస్టుకన్నా పెద్ద మంచివారేం కారని లెప్టీ ఉడ్విన్ అన్నారు. అయినా ఎలాంటి ఆలోచన లేకుండా వ్యాఖ్యలు చేసే ఇలాంటివారిని భారత పార్లమెంటు కొన్నేళ్లుగా ఎందుకు అనుమతిస్తుందో అర్థం కావడం లేదని ఆమె మండిపడ్డారు. వీరి మాటలకు జైలులో ఉన్న రేపిస్టు ముఖేశ్ సింగ్ మాటలకు తేడా ఏమైనా ఉందా' అని ఆమె నిలదీశారు. ప్రధాని నరేంద్రమోదీ అలాంటి మంత్రిని సహించరాదని అన్నారు. గిరిరాజ్ సింగ్ను వెంటనే ఆ బాధ్యతలనుంచి తప్పించాలని సూచించారు. మొత్తానికి దేశం మొత్తాన్ని కుదిపేసిన ఇండియన్ డాటర్ డాక్యుమెంటరీ దర్శకురాలు ఇలా ఏకంగా నీతులు చెప్పడం ఏంటో అని కొందరు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. అయితే తప్పు మాటలు మాట్లాడిని వారి గురించి నిజాలు మాట్లాడితే తప్పు లేదని మరి కొందరు వాదిస్తున్నారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more