Indian Mountaineer Malli Mastan Babu Found Dead | Andes Mountains in Argentina

Indian mountaineer malli mastan babu found dead

Malli Mastan Babu news, Malli Mastan Babu death news, mountaineer Malli Mastan Babu news, Malli Mastan Babu found dead, Andes Mountains in Argentina, Rescue Malli Mastan Babu, Ministry of External Affairs, fastest seven summiteer, IIT-Kharagpur, Mt Vinson Massif, Andhra Pradesh, Mt Everest

Indian Mountaineer Malli Mastan Babu Found Dead : Indian mountaineer Malli Mastan Babu, who went missing since March 24 while on a climb in the Andes Mountains in Argentina, has been found dead by authorities.

పర్వతాల ఒడిలోనే శాశ్వతంగా నిద్రించిన ‘గిన్నిస్’ మస్తాన్

Posted: 04/04/2015 10:32 AM IST
Indian mountaineer malli mastan babu found dead

ఎన్నో పర్వాతాలను అవరోధించి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న మల్లి మస్తాన్ బాబు.. మరో ఘనత సాధించేందుకు ఇటీవలే సాహసయాత్రకు బయలుదేరిన విషయం తెలిసిందే! అయితే.. అలా వెళ్లిన మస్తాన్ బాబు జాడ కనిపించలేదు. దాదాపు పదిరోజులపాటు అతని ఆచూకీ కోసం వెతకగా.. చివరికి అతడు మరణించినట్లుగా అధికారులు వెల్లడించారు. అర్జెంటీనాలోని ఆండీస్ పర్వతశ్రేణుల్లో మస్తాన్ బాబు విగతజీవిగా కనిపించాడని వాళ్లు తెలిపారు.

మస్తాన్ బాబు మిస్ అయిన నేపథ్యంలో అతని ఫ్రెండ్స్, సన్నిహితులు ‘రెస్క్యూ మల్లి మస్తాన్ బాబు’ పేరిట ఓ ఫేస్ బుక్ పేజీని క్రియేట్ చేశారు. అతనికి సంబంధించిన ప్రతి వివరాలను షేర్ చేసేందుకు వాళ్లు ఈ పేజ్ ని రూపొందించారు. అయితే.. మస్తాన్ మరణించిన విషయం తెలియగానే ఆ పేజీలో.. ‘పర్వతాలు తమ ముద్దు బిడ్డను అక్కున చేర్చుకున్నాయి. రెస్ట్ ఇన్ పీస్ మల్లి మస్తాన్ బాబు’ అని ట్యాగ్ లైన్ పెట్టారు. దీంతో అతని మిత్రులు, శ్రేయోభిలాషులు సంతాపం తెలుపుతున్నారు. మస్తాన్ మరణవార్త వెలువవడిన అనంతరం అతని ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కనిపించకుండాపోయిన మస్తాన్ తిరిగొస్తాడని కుటుంబసభ్యులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ.. అతని మరణవార్త విని ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు.

ఆంధ్రరాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందిన మస్తాన్.. 2006లో 172 రోజుల వ్యవధిలోనే 7 పర్వతాలను అధిరోహించి గిన్నిస్ రికార్డులకెక్కాడు. మరో ఘనత సాధించేందుకు అతడు ఆండీస్ అధిరోహణకు బయలుదేరాడు. అలా వెళ్లిన మస్తాన్ గతనెల 24వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. ఇతను బయలుదేరిన సమయంలోనే అక్కడి వాతావరణం ఒక్కసారిగా ప్రతికూలంగా మారినట్లు అధికారులు తెలుపుతున్నారు. అయితే.. మస్తాన్ మృతికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malli Mastan Babu news  Indian Mountaineer  Andes Mountains in Argentina  

Other Articles