ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అందునా భారత దేశంలోని రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అధికార దర్పానికి దూరంగా.. సామాన్యుల కష్టాలను పరిష్కరిస్తూ.. వారిని ఇబ్బందుల పాలు చేసిన అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటున్నాడు. అరే ఏంటి.. ఒకే ఒక్కడు సినిమా కథను చెబుతున్నారు అనుకుంటున్నారా..? కన్నడ యాక్షన్ హీరో అర్జున్ నటించిన త్రిబాషా చిత్రం కదా అంటూ స్పీడై పోకండి.. ఎందుకంటే మీరు అనుకుంటున్నది సినిమా.. మేము చెబుతున్నది మాత్రం సినిమా కాదు. నిజంగా జరిగిన సన్నివేశమే.
భారత దేశ ఆర్థిక రాజధాని ముంబై కోలువైన రాష్ట్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫెడ్నావిస్.. సినిమాలో అర్జున్ చేసినట్లుగానే తమ సెక్రటేరియట్ లోని అవినీతి ఐఎఎస్ అధికారిని ఏసీబీ అధికారులకు పట్టించారు. వివరాల్లోకి వెళ్తే తన సచివాలయంలో న్యాయ శా కార్యదర్శిగా పనిచేస్తున్న మిలిండ్ కదమ్.. ఆ శాఖ పరిధిలోని నోటరీ పోస్ట్ ఇవ్వడానికి ఓ నిరుద్యోగి వద్ద లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు నేరుగా ఫడ్నవీస్‌కు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన ఫడ్నవీస్, నేరుగా ఏసీబీ అధికారులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పాటు తక్షణమే వలపన్ని పట్టేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఫడ్నవీస్ ఆదేశాలతో ఆగమేఘాలపై కార్యరంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, బాధితుడి ద్వారా మిలింద్‌కు రూ.4 లక్షలు ఇప్పించి, అవినీతి ఐఏఎస్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనుమానితుడిని పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు వినియోగించిన నాలుగు లక్షల రూపాయలను బాధితుడికి సమకూర్చింది కూడా ముఖ్యమంత్రి ఫెడ్నావిసే. మంత్రి పాటిల్ తో కలసి ఆయన నాలుగు లక్షల రూపాయలను సమకూర్చారట.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more