Malli Mastan Babu’s final Andes mountains climb too was successful

Malli mastan babu s final climb too was successful

Malli Mastan Babu news, Malli Mastan Babu death news, mountaineer Malli Mastan Babu news, Malli Mastan Babu found dead, Andes Mountains in Argentina, Rescue Malli Mastan Babu, Ministry of External Affairs, fastest seven summiteer, IIT-Kharagpur, Mt Vinson Massif, Andhra Pradesh, Mt Everest, Indian mountaineer malli mastan babu found dead, venkaiah naidu, central minister

Satyam Bheemarasetti, one among those who helped co-ordinate the rescue of Malli Mastan Babu, said that despite the tragedy that struck Mastan, he was returning after a successful climb

అండ్రీస్ పర్వతశ్రేణులను కూడా విజయంతంగా ఎక్కిన మస్తాన్ బాబు

Posted: 04/05/2015 01:57 PM IST
Malli mastan babu s final climb too was successful

ఆండీస్‌ పర్వతాల్లో చిక్కుకున్న భారత పర్వతారోహకుడు, తెలుగు తేజం మల్లి మస్తాన్‌ బాబు తన చిట్టచివరి ఆశయాన్ని కూడా నెరవేర్చుకున్నారు. అండ్రీస్ పర్వతాలు తన కోడుకు ముద్దాడింది. తనను అధిరోహించిన ధీరుడుని తనలోనే ఐక్యం చేసుకుంది. అయితే అండ్రిస్ పర్వతాన్ని ఎప్పటికైనా ఎక్కాలని నిశ్చయించుకున్న మస్తాన్ బాబు పర్వతాలను విజయవంతంగా అధిరోహించి కిందకు దిగుతున్నక్రమంలో విగత జీవిగా మారాడు. ప్రతికూల వాతావరణం కారణంగానే ఆయన మరణించినట్టు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ‘సెర్రో ట్రెస్‌ క్రూసెస్‌ సుర్‌’ మంచు పర్వత ప్రదేశంలో 5900 అడుగుల ఎత్తున మృతదేహాన్ని గుర్తించినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అక్బరుద్దీన్‌ వెల్ల్లడించారు.


మస్తాన్‌ మార్చి 22వ తేదీన ఆండీస్‌ పర్వతశ్రేణి ఎక్కేందుకు నలుగురు సభ్యుల బృందంతో కలిసి వెళ్లాడు. చిలీలో రెండో అత్యంత పెద్దదైన సెర్రో ట్రెస్‌ (6749 మీటర్లు)ను ఒంటరిగా అధిరోహించేందుకు బేస్‌ క్యాంప్‌నుంచి బయల్దేరాడు. విజయవంతంగా పర్వతాన్ని అధిరోహించాడు. అక్కడ ఎప్పటి మాదిరిగానే భారతదేశం జెండాను, హిందూ మత గ్రంధం భగవద్గీతను అక్కడి వుంచాడు. అ తరువాత చివరగా మార్చి 24న మస్తాన్‌ తన స్నేహితుడితో మాట్లాడాడు. వాతావరణం ప్రమాదకరంగా మారడంతో అదే రోజు సాయంత్రానికల్లా బేస్‌ క్యాంప్‌నకు వస్తానని వారితో చెప్పాడు. కానీ రాలేదు.

ఈ విషయాలను తన బృందం సభ్యుడు సత్యం భీమరసెట్టి చెప్పాడు. నియో సిలికా సీఈఓగా వ్యవహరిస్తున్న భీమర సెట్టి.. మస్తాన్ తో కలసి అండ్రిస్ పర్వత శ్రేణులను అధిరోహించేందుక వెళ్లాడు. అయితే మస్తాన్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో.. అతని కోసం బృందం సభ్యులందరం వెతికామని చెప్పారు. అనేక బాషలు మాట్లాడగలిగే మస్తాన్ బాబు ప్రపంచ పౌరుడని అయన కితాబిచ్చారు. మస్తాన్ స్పానిష్ బాషను కూడా చక్కగా మాట్లాడతారని చెప్పారు. ఇలాంటి వ్యక్తి.. మరణించేంత వరకు అ దేశం గుర్తించకపోవడం శోఛనీయమని వ్యాఖ్యానించాడు. మస్తాన్ బౌతికఖాయాన్ని ప్రత్యేక విమానంలో తెప్పిస్తాం వెంకయ్య

అర్జంటైనా ఆండీస్ పర్వతాలలో మృతి చెందిన మల్లి మస్తాన్బాబు భౌతిక కాయాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... మస్తాన్ బాబు మృతదేహాన్ని స్వదేశానికి రప్పించే విషయమై ఇప్పటికే దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్తో మాట్లాడినట్లు తెలిపారు. ఎయిర్ ఇండియా విమానంలో మస్తాన్ మృత దేహం చెన్నై వరకు వస్తుంది.. అక్కడి నుంచి  మృతదేహాన్ని అతడి స్వగ్రామం గాంధీజన సంగం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ను ఆదేశించినట్లు వెంకయ్య నాయుడు చెప్పారు.

‘అర్జున’తో గౌరవించాలి: మిత్రులు, అభిమానులు

అత్యంత వేగంగా ఏడు పర్వతాలను అధిరోహించిన భారతీయుడిగా మస్తాన్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మస్తాన్‌ 172 (2006 జనవరి 19 నుంచి జూలై 10) రోజుల్లోనే ఈ ఫీట్‌ సాధించాడు. మస్తాన్‌ నేలకొరిగిన ఆండీస్‌ పర్వత శ్రేణిలో ప్రఖ్యాత అకాన్కాగో (6963 మీటర్లు) పర్వతాన్ని మూడుసార్లు అధిరోహించాడు. పర్వతారోహణకు పర్యాయపదమైన మస్తాన్‌ బాబును ప్రపం చం గుర్తించినా భారతీయులు గుర్తించలేదని ఆయన స్నేహితులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు ఖండాలపై మువ్వన్నెల జెండాను ఎగురవేయడమే ధ్యేయంగా జీవితాన్ని ఫణంగా పెట్టిన మస్తాన్‌ అర్జున అవార్డుకు అర్హుడని చెబుతున్నారు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మస్తాన్‌... కోట్లు సంపాదించే అవకాశాలున్నా కేవలం దేశం కోసమే చివరి వరకు బ్రతికాడని అతని మిత్రులు పేర్కోన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malli Mastan Babu  mountaineering  Andes sucessful climbling  

Other Articles