lk advani news | narendra modi news | BJP 35th foundation day

Lk advani left out of bjp 35th foundation day

lk advani news, lk advani controversy, lk advani photos, lk advani updates, BJP 35th foundation day, narendra modi updates, advani modi controversy

LK Advani left out of BJP 35th foundation day : BJP's 35th foundation day celebrations on Monday, the first after its historic victory in the 2014 Lok Sabha polls, was marred by allegations by circles sympathetic to L K Advani that the veteran was not invited for the function.

బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి మరోసారి పరాభావం..

Posted: 04/07/2015 04:27 PM IST
Lk advani left out of bjp 35th foundation day

భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపకుల్లో అగ్రగణ్యుడైన లావ్ కృష్ణ అద్వానీకి పార్టీ నేతల నుంచి అవమనాల పరంపర ఎదరవుతూనే వుంది. పార్టీకి జీవం పోసి, అధికారం చేపట్టే స్థాయికి పార్టీని తీసుకురావడంలో కీలక భూమి పోషించిన అద్వానీకి ఆ పార్టీలోనే కనీసం గౌరవం కూడా లభించడం లేదు. పార్టీలో సుదీర్ఘ రథయాత్రను సాగించిన ఈయనకు ప్రాధాన్యమివ్వకపోవడంతో ఆయన అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. కురువృద్ధుడి హోదాలో వుండి పరిణామాలను గమనిస్తూ వస్తున్న ఎల్.కే. అద్వానీ తాజాగా మరోసారి పరాభావం ఎదుర్కోవాల్సి వచ్చింది.

మొన్నటికి మొన్న బెంగుళూరులో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తనకు ప్రాధాన్యమివ్వకపోవడంతో అలిగిని అద్వానీ.. ప్రసంగించేందుకు ససేమిరా అన్నారు. ఇప్పుడు పార్టీ 35వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఘోర అవమానాన్ని చవిచూడాల్సి వచ్చింది. సోమవారం అంగరంగ వైభవంగా దేశవ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో ప్రధాని స్థాయి నుంచి సామాన్య కార్యకర్త వరకు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు కానీ.. అద్వానీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఎందుకు రాలేదని ఆరాతీస్తే.. అసలు ఈ దినోత్సవాల్లో పాల్గొనాలని ఆయనకు ఆహ్వానమే అందలేదని తెలిసింది. ఆహ్వానం పత్రిక కాదుకదా.. కనీసం టెక్ట్స్ మెసేజ్ కూడా ఆయనకు అందలేదని సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lk advani news  narendra modi news  BJP 35th foundation day  

Other Articles