చిత్తూరు జిల్లా శేషాచలం అడువుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల సంఘం( ఎన్ హెచ్ ఆర్సీ) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై రెండు వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్ కౌంటర్ అంశాన్ని ఎన్ హెచ్ ఆర్సీ సభ్యుడు జస్టిస్ మురుగేశన్ సంఘం దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఎన్ కౌంటర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారన్న వాదనలో అర్థం లేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఈనెల 23న హైదరాబాద్ లో వాదనలు వింటామని మానవ హక్కుల సంఘం తెలిపింది.
కాగా ఎన్ కౌంటర్ కు వ్యతిరేకంగా చెన్నైలోని కోయంబేడు అంతర్రాష్ట్ర బస్టాండ్లో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన తొమ్మిది బస్సులను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తిరుపతి డిపోకు చెందిన ఆరు బస్సులు, నెల్లూరు డిపోకు చెందిన మూడు బస్సులు దుండగుల దాడిలో ధ్వంసమయ్యాయి. శేషాచలం అడవుల్లో ఎన్కౌంటర్ జరిగిన తీరును తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిచాయి. ఏపీ ఆస్తులు, వాహనాలపై దాడులకు దిగుతామంటూ పలు సంస్థలు హెచ్చరించాయి. ఎన్ కౌంటర్ ఘటనపై సీబిఐ చేత విచారణ జరిపించాలని తమిళనాడు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇటు నెల్లూరు జిల్లా తడ పట్టణం సమీపంలోని పూడి వద్ద మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. బైక్పై వెళ్తున్న దుండగులు బస్సుపై పెట్రోల్ బాంబు విసిరి వెళ్లిపోయారు. అయితే, అది బస్సు పక్కన పడటంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులోని ప్రయాణికులు దుండగులను అడ్డుకోగా వారు పరారయ్యారు. ఎన్ కౌంటర్ కు నిరసనగా దుండగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, దర్యాప్తు చేస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more