Munir ahmad | Police | AP | SEMI

Police took custody munir ahmad who travel to chittur in thirumalaexpress

railway, police, terrorist, semi, tanuku, bapatla, ap, munir ahmad

police took custody munir ahmad who travel to chittur in vthirumalaexpress. In the two states of telugu, police got information for semi terrorists. THe ap police check the tenali, bapatla railwaystations.

అతను సిమి ఉగ్రవాదేనా?.. పోలీసుల అనుమానం

Posted: 04/09/2015 09:18 AM IST
Police took custody munir ahmad who travel to chittur in thirumalaexpress

తెలుగు రాష్ట్రాల్లో సిమి ఉగ్రవాదులు సంచరిస్తురిస్తున్నారని, ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సిమి ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో గుంటూరు జిల్లా తెనాలి, బాపట్ల రైల్వే స్టేషన్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో ఉగ్రవాదులు వెళ్తుతున్నారని వచ్చిన సమాచారంతో తెల్లవారుజామున తెనాలి రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

అతని వద్ద ఉన్న రెండు బ్యాగుల్లో 50 వేల నగదు, రోడ్ అట్లాస్ ఉన్నాయి. తన పేరు మునీర్‌ అహ్మద్ అని, తమిళనాడు కలక్కడ్ తమ స్వగ్రామమని అతను పోలీసులకు తెలిపాడు. అయితే ముందు తనిఖీలకు వచ్చిన పోలీసులను చూసి నిద్రిస్తున్నట్లు నటించడం, అతని బ్యాగ్ లొ రాజస్థాన్, హర్యాణా రాష్ట్రాల మ్యాప్ లతో పాటు, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ లాంటి ప్రధాన నగరాల చిత్ర పటాలు ఉడటంతో పోలీసులు అనుమానించి అరెస్టు చేశారు. అయితే నిందితుడు మాత్రం తాను చెట్ల వ్యాపారం చేస్తానని,. అందులో భాగంగానే చెట్ల కోసం చిత్తూరు వెళుతున్నానని తెలిపారు. అయితే అతన్ని అదుపులోకి తీసుకున్న జీఆర్పీ పోలీసులు అతని నుంచి అదనపు సమాచారం సేకరిస్తున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : railway  police  terrorist  semi  tanuku  bapatla  ap  munir ahmad  

Other Articles