Supremecourt | Encounter | AP | Chittur

The supreme court noticed the ap encounter pil and ready to took petetion

encounter, ap, pil, supremecourt, chandrababu, rayudu, dgp, tamilnadu, sadalwood

The supreme court noticed the ap encounter pil and ready to took petetion.The reason given by Andhra Pradesh's Red Sanders Anti-Smuggling Taskforce that they feared for their own lives and shot dead 20 woodcutters from Tamil Nadu is hardly a legal defence, especially when the Supreme Court has held that the act of extra-judicial killing by the police, if not justified, amounts to culpable homicide.

సుప్రీంకోర్ట్ లో తిరుపతి ఎన్ కౌంటర్ పై పిటిషన్

Posted: 04/09/2015 12:51 PM IST
The supreme court noticed the ap encounter pil and ready to took petetion

తిరుపతి ఎన్ కౌంటర్ వ్యవహారం సుప్రింకోర్టు వరకు వెళ్లింది. గతంలో కొన్ని నకిలీ ఎన్ కౌంటర్ల విషయంలో సుప్రింకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపద్యంలో శేషాచలం అడవులలో జరిగిన ఎన్ కౌంటర్ కు ప్రాముఖ్యత ఏర్పడింది.తమిళనాడు కు చెందిన కృష్ణమూర్తి అనే న్యాయవాది సుప్రింకోర్టులో ప్రస్తావన వేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిజిపి కుమ్మక్కై ఈ ఎన్ కౌంటర్ చేయించారని కృష్ణమూర్తి ఆరోపించారు.సుప్రింకోర్టు జడ్జి తో విచారణ జరగాలని,సిబిఐ విచారణ చేయాలని, హత్య కేసు నమోదు చేయాలని తాము కోరుతున్నామని అన్నారు. సుప్రింకోర్టు ఛీఫ్ జస్టిస్ దత్ దీనిపై స్పందిస్తూ పిటిషన్ వేస్తే విచారణకు స్వీకరిస్తామని చెప్పారని కృష్ణమూర్తి తెలిపారు. అయితే కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తులు కేసు విచారణను స్వీకరించేందుకు సిద్దమయింది. అయితే గతంలో ఎన్నో ఎన్ కౌంటర్ కేసులలో పోలీసుల వైఖరిని తప్పుపట్టిన సుప్రీంకోర్టు ఈ సారి ఎలాంటి తీర్పును వెల్లడిస్తుందో చూడాలి.

తిరుపతి శేషాచలం అడవుల్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్పై ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.  ఎన్కౌంటర్పై సీబీఐ లేదా సిట్తో విచారణ జరిపించాలని ఆ స్వచ్ఛంద సంస్థ తన పిటిషన్లో కోరింది. న్యాయస్థానం పిటిషన్ను విచారణకు స్వీకరించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఎర్ర చందనం కూలీల ఎన్‌కౌంటర్ పై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఉమ్మడి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి. రాముడిని ఆదేశిసించి విషయం తెలిసిందే. అయితే ఏపి డిజిపి రాముడు మాత్రం ఎన్ కౌంటర్ ను సమర్థిస్తు వ్యాఖ్యాలు చేశారు. పోలీసులు ఎంతో  చాకచక్యంగా వ్యవహరించారని వెల్లడించారు. మరి సుప్రీంకోర్టు కేసును స్వీకరిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : encounter  ap  pil  supremecourt  chandrababu  rayudu  dgp  tamilnadu  sadalwood  

Other Articles