Bombay High Court | Domestic Violence Complaint | Akshay Kumar | Dimple Kapadia | Twinkle Khanna

Bombay high court quashed domestic violence complaint lodged against akshay twinkle dimple

akshay kumar news, twinkle khanna news, dimple kapadia news, rajesh khanna news, anita advani news, bombay high court news, akshay kumar case, akshay kumar domestic violence case

Bombay High Court Quashed domestic violence complaint lodged against akshay twinkle dimple : In a relief to Rajesh Khanna’s wife Dimple Kapadia, daughter Twinkle Khanna and son-in-law Akshay Kumar, the Bombay High Court today quashed a complaint of domestic violence lodged against them by the late actor’s alleged live-in partner Anita Advani.

గృహహింస కేసు నుంచి అక్షయ్ దంపతులకు ఊరట!

Posted: 04/09/2015 08:34 PM IST
Bombay high court quashed domestic violence complaint lodged against akshay twinkle dimple

ఎట్టకేలకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కి, అతని భార్య ట్వింకిల్ ఖన్నాకి, అత్తగారైన డింపుల్ కపాడియాకి గృహహింస కేసు నుంచి ఊరట లభించింది. గత రెండేళ్ల నుంచి వేధిస్తూ వస్తున్న ఈ కేసు నుంచి వీరు ముగ్గురు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. చివరగా వీరంతా ముంబై హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ వీరికి ఆ కేసు నుంచి విముక్తి లభించింది. ఇంతకీ వీరిమీద గృహహింస కేసు ఎవరు పెట్టారని ఆలోచిస్తున్నారా..? ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

రెండేళ్ల క్రితం బాలీవుడ్ నటుడు రాజేష్ ఖన్నా భాగస్వామి అయిన అనితా అద్వానీ తనను గృహహింసకు గురి చేస్తున్నారంటూ ఖన్నా భార్య డింపుల్, కుమార్తె ట్వింకిల్, అల్లుడు-నటుడు అక్షయ్ కుమార్ మీద మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. రాజేష్ ఖన్నా మరణానంతరం ముంబైలోని ఆయన ‘ఆశీర్వాద్’ బంగ్లా నుంచి వారంతా కలిసి తనని అవమానపరిచి వెళ్లగొట్టారని, ఈ క్రమంలోనే తనకు నెలవారీ ఖర్చులతోపాటు బాంద్రాలో త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇవ్వాలంటూ అనిత కోరారు. దీంతో ఈమె ఇచ్చిన ఫిర్యాదు మేరకే మెజిస్ట్రేట్ కోర్టు వారి ముగ్గురికీ నోటిసులు పంపింది. అనిత ఫిర్యాదు విషయంపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఈ క్రమంలో వారు ముగ్గురు కలిసి తమపై జరుగుతున్న విచారణను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారించిన హైకోర్టు.. వారిపై వున్న ఈ గృహహింస కేసును కొట్టిపారేసింది. దీంతో అక్షయ్ దంపతులు, డింపుల్ హర్షం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా.. ఒకప్పటి ఇండియన్ సినీపరిశ్రమలో సూపర్ స్టార్ డమ్ సంపాదించిన రాజేష్ ఖన్నా తీవ్ర అనారోగ్యంతో 2012 జూలై 18వ తేదీన మరణించిన విషయం తెలిసిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akshay Kumar  Twinkle Khanna  Dimple Kapadia  Anita Advani  Rajesh Khanna  

Other Articles