Supremecourt | Order | Acidvictims

Supreme court order to provide free treatment for acid victims

supremecourt, acid, victims, hospitals, free, medicial, surgery

supreme court order to provide free treatment for acid victims. The supreme court judges justice madan b lokurm lalith prnounce to give better traement, medicins, even surgery at free of cost.

యాసిడ్ దాడి బాధితులకు ఉచితంగా వైద్యం అందించండి: సుప్రీం

Posted: 04/11/2015 09:54 AM IST
Supreme court order to provide free treatment for acid victims

దేశంలో జరుగుతున్న యాసిడ్ దాడులపై గతంలోనే సుప్రీంకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వాలు ఎలాంటి చర్యలకు దిగుతున్నారని కూడా ప్రశ్నించింది. అయితే తాజాగా యాసిడ్ దాడి బాధితులకు కల్పించే వైద్యం, వైద్య ఖర్చులపై కీలక తీర్పును వెల్లడించింది. యాసిడ్ దాడి బాధితులకు ఉచితంగా చికిత్స అందించాలని సుప్రీం కోర్టు దేశంలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులనూ ఆదేశించింది. చికిత్సతోపాటు మందులు అందించాలని, ఖరీదైన సర్జరీలు కూడా చేయాలని జస్టిస్ మదన్ బి. లోకూర్, జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన సామాజిక ధర్మాసనం స్పష్టం చేసింది. బాధితులు తక్షణం ఆస్పత్రుల్లో చేరేలా చూసేందుకు ప్రైవేట్ ఆస్పత్రులతో కలసి పనిచేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మి 2006లో వేసిన పిటిషన్‌ను పరిష్కరిస్తూ ఈమేరకు పేర్కొంది.
 
తమ వద్దకు వచ్చిన బాధితులు యాసిడ్ దాడి బాధితులని పేర్కొంటూ ఆస్పత్రులు సర్టిఫికెట్ ఇవ్వాలని, ఇది ఉచిత చికిత్సకు వీలు కల్పించేలా ఉండాలని పేర్కొంది. యాసిడ్‌ను ఇష్టారాజ్యంగా అమ్మకుండా దాన్ని షెడ్యూలు పదార్థంగా నోటిఫై చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. బాధితులకు కనీస నష్టపరిహారంగా రూ. 3 లక్షల ఇవ్వాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ పథకాలు రూపొందించాయని అదనపు సొలిటర్ జనరల్ మహీందర్ సింగ్ తెలిపారు. ఏపీ, తెలంగాణలు ఈ పథకాలను రూపొందించాయా అన్ని ధర్మాసనం అడగ్గా, అవసరమైన చర్యలు పూర్తి చేసినట్లు తెలంగాణ తరఫున హారైన న్యాయవాది కృష్ణకుమార్ సింగ్ తెలిపారు. అయితే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే యాసిడ్ దాడి బాధితులకు, రేప్ బాధితులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నాయి. కొంత నగదును కూడా అందిస్తున్నాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supremecourt  acid  victims  hospitals  free  medicial  surgery  

Other Articles