సహజీవనం.. ఇద్దరు ఆడ, మగ పెళ్లి కాకుండా సాగించే కాపురం. విదేశాల్లో ఎక్కువగా కనిపించే సహజీవన సంసృతి ఇప్పుడు మన దేశంలో ఎక్కువగా కనిపిస్తోంది. గత కొంత కాలంగా సెలబ్రెటీలు ఎక్కువగా ఇలాంటి సంసృతినే ఇష్టపడుతున్నారు. పెళ్లికి ముందు తమను నచ్చిన వ్యక్తితో కలిసి కొంత కాలం ఉండి, ఒకవేళ చేసుకోవాలి అనిపిస్తే పెళ్లి చేసుకోవడం లేదంటే వదిలెయ్యడం సహజీవనంలో జరిగే తంతు. అయితే సహజీవనం గురించి సుప్రీంకోర్ట్ మాత్రం కొత్త భాష్యం చెబుతోంది.
ఇద్దరు పెళ్లికాని వాళ్లు కలిసి కాపురం చేస్తుంటే వాళ్లను పెళ్లయినవాళ్లు గానే భావిస్తామని సుప్రీంకోర్ట్ వెల్లడించింది. సహజీవనం చేస్తున్న వారిలో మేల్ పార్ట్ నర్ చనిపోతే అతనికి చెందిన ఆస్తికి సహజీవనం చేసిన మహిళ వారసురాలు అవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఒకవేళ అలా కాదు.. ఆస్తి ఇవ్వకూడదనుకుంటే, వాళ్లిద్దరికీ చట్టబద్ధంగా పెళ్లికాలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ మగవాడి తరఫు పార్టీమీదే ఉంటుందని స్పష్టం చేసింది. ఎక్కువ కాలం పాటు ఒక పురుషుడు, ఒక మహిళ కలిసి నివసిస్తుంటే దాన్ని పెళ్లిగానే చట్టం భావిస్తుందని జస్టిస్ ఎంవై ఇక్బాల్, జస్టిస్ అమితవ రాయ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక రూలింగ్‌లో తెలిపింది. 2010 నుంచి కూడా సుప్రీంకోర్టు సహజీవనం చేస్తున్న జంటలను భార్యాభర్తలుగానే పరిగణిస్తూ వారికి అనుకూలంగానే రూలింగులు ఇస్తోంది.
అయితే గతంలో మాత్రం సుప్రీంకోర్ట్ సహజీవనం కేసు విషయంలో ఆడ, మగ ఇద్దరు కలిసి కాపుర చేస్తూ ఉంటే వారిలో ఆడవారు కోర్టులను ఆశ్రయించినా వారిద్దరి బంధాన్ని సహజీవనంలా భావించలేమంటూ సుప్రీం ధర్మాసనం తేల్చింది. కానీ తాజాగా మాత్రం సహజీవనం గురించి కుండబద్దలు కొట్టింది. ఆస్తుల పంపకం విషయంలో సుప్రీం తీర్పు ఎంతో కీలకంగా మారనుంది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more