కాస్త ఇమేజ్ వస్తే చాలు.. కొందరు తారలకు పైత్యం ముదిరి కావాలనే వివాదాలు కొనితెచ్చుకుంటారు. తాము చేస్తున్నది తప్పని తెలిసినప్పటికీ.. వార్తల్లో నిలిచేందుకు ఆ పనిని కావాలనే చేస్తారు. అలాంటివారిల్లో సింగర్ మికా సింగ్ ఎప్పుడూ ముందుంటారని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ పంజాబీ సింగర్.. తాజాగా మరో కొత్త కాంట్రోవర్సీలో చిక్కుకున్నాడు. ఇతగాడు ఓ వైద్యుడి చెంపలు పటాపంచలు చేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ ఆప్తామాలజికల్ సొసైటీ వారు ఢిల్లీ పుసా ఇన్స్టిట్యూట్ మేలా గ్రౌండ్లో మూడు రోజులపాటు ఓ సదస్సును నిర్వహించారు. చివరిరోజున ప్రత్యేక ఆకర్షణ కోసం వారు సింగర్ మికాను ముఖ్య అతిథిగా ఆహ్వానించి... అతనితో కచేరీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈ లైవ్ కాన్సర్ట్ ముగిసే సమయంలో తాను చెప్పినట్లు చేసేందుకు మికాసింగ్ ఆడియెన్స్ నుంచి ఒకరిని స్టేజ్ మీదకు పిలిచాడు. అప్పుడు స్టేజ్ మీదకు అంబేద్కర్ ఆస్పత్రిలో కంటి వైద్యుడిగా పనిచేస్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తి వచ్చాడు. డయాస్ పై వారిమధ్య ఏం జరిగిందో ఏమో తెలీదుగానీ.. మికా సింగ్ ఆ డాక్టర్ చంపలు వాయించి, అతనిని బౌన్సర్లకు అప్పగించాడు. వారు కూడా అతడిపై దాడి చేయడంతో అతడి ఎడమ చెవికి గాయాలవడంతోపాటు, శరీర అంతర్భాగాలకు కూడా గాయాలయ్యాయి.
ఈ మేరకు బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఆ డాక్టర్ అనుచితంగా ప్రవర్తించడం వల్లే తాను అతనిపై చేయి చేసుకున్నానంటూ మికా పేర్కొంటున్నాడు. అటు మికా చేసిన ఈ తెలివితక్కువ పనిపై కొందరు డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుండగా.. మికా డాక్టర్ను కొట్టిన వీడియో ఇప్పుడు యూట్యూబ్తోపాటు పలు సైట్లలో హల్చల్ చేస్తోంది. గతంలో కూడా మికా ఇలాగే ఓ అభిమానిని కొట్టిన విషయం తెలిసిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more