భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌కు ఆర్ఎస్ఎస్ కొత్త రంగును అద్దుతోందా..? ఘర్ వాపసీకి అంబేద్కర్‌ను అంబాసిడర్ చేస్తున్నారా?... అంబేద్కర్ 125వ జయంతి సందర్బంగా దేశమంతా ఇప్పుడిదే చర్చ. ఓ వైపు కాంగ్రెస్ సంవత్సరం పాటు అంబేద్కర్ జయంత్యుత్సవాలు జరపడానికి నిర్ణయించింది. మరో వైపు ఎప్పుడూ లేని విధంగా అంబేద్కర్ పేరిట ఓ స్మారక చిహ్నాన్నీ ఏర్పాటు చేయాలని.. ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని బీజేపీ డిసైడ్ అయ్యింది. కానీ ఆర్ఎస్ఎస్ మాత్రం అంబేద్కర్‌ను మరో కోణంలో చూపాలనుకుంటోంది.
బలవంతంగా మతం మారిన హిందువులను తిరిగి సొంత మతంలోకి తీసుకొచ్చేందుకు చేపట్టినట్టుగా చెబుతున్న ఘర్‌వాపసీ కార్యక్రమానికి అంబేద్కర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా తెరపైకి తేవాలని ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోంది. ఈ దిశగా అంబేద్కర్‌కు సంబంధించిన అనేక విషయాలను తన అధికార పత్రికలైన పాంచజన్య, ఆర్గనైజర్ ద్వారా జనబాహుళ్యంలోకి తీసుకురావాలని చూస్తున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇస్లాం దురాక్రమణ, ఇస్లాంలోకి మత మార్పిడి, కమ్యూనిజం, ఆర్టికల్ 370 తదితర అంశాలను ఆయన వ్యతిరేకించారంటూ ఆర్ఎస్ఎస్ ప్రచారం చేయాలనుకుంటోందని ఒక జాతీయ ఆంగ్ల పత్రిక బయటపెట్టింది.
పాకిస్థాన్‌లో దళిత హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చుతున్న తీరును అంబేద్కర్ వ్యతిరేకించారు. అలాంటి వారు భారత్‌లోకి రావొచ్చని ఆయన పిలుపునిచ్చారు. తద్వారా ఘర్‌వాపసీని అంబేద్కర్ సమర్థించారని ఆర్ఎస్ఎస్ అధికార పత్రికైన ఆర్గనైజర్ ఎడిటర్ ప్రఫుల్ల కేత్కర్ అన్నట్లు వార్తలొచ్చాయి. హిందువుల్లోని బలహీనతను ఆసరాగా చేసుకుని రాజకీయాలు, నేరాలకు పాల్పడే వారి తీరును అంబేద్కర్ అప్పట్లోనే తప్పుబట్టారని కేత్కర్ అంటున్నారు. మరోవైపు 125వ జయంతి సందర్బంగా ఆర్ఎస్ఎస్ మరో అధికార పత్రిక పాంచజన్య యుగద్రష్ట అంబేద్కర్ అంటూ ప్రత్యేక సంచిక విడుదల చేసింది. ఇస్లాంలోకి, క్రైస్తవంలోకి హిందువుల మతమార్పిడులను వ్యతిరేకించారని పేర్కొంటూ ఆయన్ని వీరసావర్కర్, మదన్ మోహన్ మాలవీయ వంటివారి సరసన నిలిపింది.
అంబేద్కర్‌ను భారతీయ విలువల కథానాయకుడిగా ఆర్ఎస్ఎస్ అభివర్ణించింది. హిందువులను ఏకం చెయ్యడానికి ఆయన 1924 నుంచి 1935 మధ్య కాలంలో దశాబ్దకాలానికి పైగా కృషి చేశారని కొనియాడింది. పాకిస్థాన్ ఏర్పాటుకు సంబంధించి ఆయన.. ఒక నౌక కెప్టెన్లా ఆలోచించారని, అదనపు లగేజీ సముద్రంలో పారవేయడం వల్ల భారత నౌక ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రయాణిస్తుందనే ఉద్దేశంతోనే ఆయన విభజనకు అంగీకరించారని వివరించింది.దళితులు క్రైస్తవంలోకి, ఇస్లాంలోకి మారడానికి అంబేద్కర్ వ్యతిరేకి అని.. ముస్లింలు, క్రైస్తవుల సంఖ్య పెరిగితే భారతదేశానికి ప్రమాదమని భావించేవారని వివరించింది. మొత్తానికి 125వ జయంతి సందర్బంగా బాబా సాహెబ్ అంబేద్కర్‌కు ఆర్ఎస్ఎస్ ఆపాదిస్తున్న కొత్త కోణాలపై వివిధ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more