Intelligence Bureau issued alert mumbai city | Mumbai 26/11 attack

Intelligence bureau lashkar e taiba mumbai 26 11 attacks plan

Intelligence Bureau news, Intelligence Bureau report, mumbai attacks 26/11, Intelligence Bureau warns 26/11 attacks, Anti-Terrorism Squad, Anti-Terrorism Squad warns mumbai attacks, lashkar e taiba attacks, mumbai attacks updates, mumbai police alert, central home minister rajnath singh, rajnath singh updates

Intelligence Bureau lashkar-e-taiba mumbai 26/11 attacks plan : There is a possibility of another 26/11 like attack in Mumbai in the next 2-3 months according to the Intelligence Bureau which issued an alert for the city after the Railways Police Commissioner wrote to the Anti-Terrorism Squad (ATS) warning of a terror strike.

పాక్ ఉగ్రవాదుల పక్కా ప్లాన్.. మరో 3 నెలల్లో 26/11 తరహా దాడులు

Posted: 04/14/2015 06:53 PM IST
Intelligence bureau lashkar e taiba mumbai 26 11 attacks plan

భారతదేశంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన ముంబై నగరంపై పాకిస్తాన్ ఉగ్రవాదులు మరోసారి మరోసారి 26/11 తరహా దాడులు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇప్పటికే ఉగ్రవాదులు అందుకోసం అన్ని ప్రణాళికలు ఏర్పాటు చేశారని, వారికి సహాయం అందించేందుకు ముంబైలోనూ మద్దతుదారులున్నారని నిఘా వెల్లడించింది. ‘మరో మూడు నెలలపాటు ముంబై వెళ్లకపోతే మీకు చాలా మంచిది. ఎందుకంటే రాబోయే మూడు నెలల్లో ముంబైలో ఘోర ఉగ్రదాడులకు పాల్పడటానికి లష్కరే తోయిబా ఉగ్రవాదులు ప్లాన్ చేశారు’ అంటూ నిఘా వర్గాలు మహారాష్ట్ర ప్రభుత్వానికి, ముంబై పోలీసులకు సమాచారం అందించింది.

నిఘా వర్గాలు అందించిన మరిన్ని వివరాలు ఇలా వున్నాయి... ‘రాబోయే మూడు నెలల్లో ఏ క్షణమైనా లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబై దాడులకు తెగబడవచ్చు. మరోసారి 26/11 తరహాలోనే అనేకసార్లు దాడి చేయడానికి లష్కరే తోయిబా ప్లాన్ చేసింది. ఈ ప్లాన్ అమలు చేయడానికి పది మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు  అరేబియా సముద్రం ద్వారా ముంబైలోకి రెండు మూడురోజుల్లో చొరబడే అవకాశం ఉంది. వారికి అవసరమైన సహాయం చేయడానికి ముంబైలో వారి మద్దతుదార్లు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముంబైలో జన సమ్మర్థత అధికంగా ఉండే హోటళ్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, సీ పోర్ట్‌ల్లో దాడులు చేయడానికి ఉగ్రవాదులు ప్లాన్ చేసుకుంటున్నారు. 2008లో జరిగిన 26/11 ఎటాక్స్‌కు ప్రధాన సూత్రధారి అయిన జకీర్ రెహ్మాన్ లఖ్వీని పాక్ ప్రభుత్వం విడుదల చేయడంతో లష్కర్ తోయిబా రాబోయే రోజుల్లో భారత్‌పై మరిన్ని దాడుల చేయడానికి చురుగ్గా వ్యూహాలు పన్నుతోంది’ అంటూ నిఘా వర్గాలు తెలిపాయి.

mumbai-attacks-news-gossips

ఈ విధంగా నిఘా వర్గాలు చేసిన హెచ్చరికల నేపథ్యంలో నగరంలో హైఅలర్ట్ ను ప్రకటించారు. సుమారు 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబై రైల్వే సేష్టన్లను టార్గెట్‌ చేశారనే ఐబీ హెచ్చరికల నేపథ్యంలో అన్నీ రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు నగరంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. నిఘా వర్గాలు ఈ ఉగ్రవాదుల సమాచారాన్ని వెల్లడించిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దులో పాకిస్థాన్ హద్దుమీరితే తగినవిధంగా గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. దాయాది దేశం రెచ్చగొడుతున్నా ఇంకెన్నాళ్లు శాంతి కపోతాలు ఎగరేస్తామని ఆయన ప్రశ్నించారు. పాకిస్థాన్ కాల్పులు జరిపితే చేతులు ముడుచుకుని కూర్చోనక్కర్లేదని బీఎస్ఎఫ్ కు చెప్పామని ఆయన వెల్లడించారు.

భారత సరిహద్దును పరిరక్షిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు కూడా ఇదే సందేశాన్ని పంపించామని రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఇకపై చేతులు ముడుచుకోకుండా ప్రతిదాడులకు దిగి, చొరబాట్లకు యత్నిస్తున్న ఉగ్రవాదులకు సహకరిస్తున్న పాక్ సైన్యానికి తగిన బుద్ధి చెప్పాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles