కోతి చేష్టలని ఊరికే అంటారా పెద్దలు.. అంతేకాదు.. ఈ వనరాలు చేసే పనులపై అనేక సామెతలు కూడా పుట్టుకోచ్చాయంటే అతిశయోక్తి కాదు సుమా. తా చెద్ద కోతి వనమంతా చెరచినట్లని ఊరికే అన్నారా.. వనాన్నే చెరచిన వానరాలు వున్నయని, అంత పెద్ద పెట్టున వాటి అల్లరి చేష్టలు వుంటాయనే కదా. ఇక్కడ కూడా అలాంటి ఓ కోతి అల్లరి చేసింది. అయితే ఇక్కడ చెరిచింది వనాన్ని మాత్రం కాదు. ఏకంగా పలు రైళ్ల రాకపోకలను అపేసింది వానరం. నిత్యం బిజీగా వుండే విజయవాడ- వరంగల్ మార్గంలో పలు రైళ్లు నిలిపేసింది. కోతికి రైళ్ల రాకపోకలకు సంబంధం మేంటని అడుగుతున్నారు కదూ. అక్కడికే వస్తున్నాం.
వరంగల్ జిల్లా సంగెం మండలం ఎల్గూరు స్టేషన్లో ఓ గూడ్స్ రైలును క్రాసింగ్ కోసం ఆపారు. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో గూడ్స్ వ్యాగన్ మీదకు ఎక్కిన కోతి అక్కడి నుంచి ఎగురుతూ విద్యుత్ కాంటాక్ట్ వైరును పట్టుకుంది. దాంతో హైటెన్షన్ విద్యుత్ ప్రసారం జరిగి మంటలు చెలరేగాయి. విద్యుత్ తీగ కూడా తెగిపోయింది. దాంతో రైళ్లన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులంతా అల్లాడిపోయారు. దాదాపు మూడు గంటల పాటు రైళ్లనీ ఆగిపోవడంతో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. అయితే.. ఇంత అల్లరి చేసి, విద్యుత్ తీగను తెంపేసినా కోతికి మాత్రం ఏమీ కాలేదు. తీగ తెగగానే దాన్ని వదిలి అక్కడి నుంచి పారిపోయింది. ఇది గ్రహించిన అధికారులు వెంటనే మరమ్మతులు చేయించి రైళ్ల రాకపోకలను మళ్లీ క్రమబద్దీకరించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more